తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Sachin Tendulkar: రోడ్డుపై క్రికెట్ ఆడిన సచిన్… వీడియో వైరల్‌

టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ప్రస్తుతం తన తొలి కాశ్మీర్‌ పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సచిన్‌ తన కుటుంబంతో కలిసి చుట్టేస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్‌ మరోసారి బ్యాట్‌ పట్టి సందడి చేశాడు. గుల్మార్గ్‌లో స్థానికులతో కలిసి మాస్టర్‌ బ్లాస్టర్‌ గల్లీ క్రికెట్ ఆడాడు.

Also Read: నేడే ఐపీఎల్ షెడ్యూల్.. తొలి మ్యాచ్ ఎక్కడంటే!

చుట్టూ లోయల మధ్య రోడ్డుపై స్థానికులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేశాడు. తనను ఔట్ చేయాలని వారికి సచిన్ సవాల్ విసిరాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్ వికెట్ తీయడంలో వారు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా “క్రికెట్‌ అండ్‌ కాశ్మీర్‌.. స్వర్గంలో మ్యాచ్‌” అంటూ రాసుకొచ్చాడు.

Also Read: విరాట్ కోహ్లి కొడుకు అకాయ్ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్

కశ్మీర్ టూర్ లో సచిన్ తాజాగా క్రికెట్ బ్యాట్‌ల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. కశ్మీర్‌లో మాత్రమే లభించే విల్లో చెట్టు టేకుతో తయారు చేసిన బ్యాట్లను ఆయన పరిశీలించారు. బ్యాట్ నాణ్యత, ఇతర అంశాలపై ఆరా తీశారు. తన తొలి బ్యాట్ కశ్మీర్ విల్లోతో తయారు చేసిందేనని ఈ సందర్భంగా సచిన్‌ గుర్తు చేసుకున్నారు. ఆ బ్యాట్‌ను తన సోదరి ఇచ్చినట్లు చెప్పాడు.

Also Read: రచిన్‌ రవీంద్ర మెరుపు ఇన్నింగ్స్.. కివీస్‌కు తప్పని ఓటమి

అదే విధంగా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అమన్ సేతు వంతెనను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్‌ ముచ్చటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button