తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

Football: మ‌హిళా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌కు లిప్ కిస్…కోర్టుకెళ్లినా జెన్ని హెర్మోసో

మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ త‌ర్వాత జ‌రిగిన ప్ర‌జెంటేష‌న్ సెర్మ‌నీ స‌మ‌యంలో.. స్పెయిన్ క్రీడాకారిని జెన్ని హెర్మోసోకు ఆ దేశ ఫుట్‌బాల్ స‌మాఖ్య అధ్య‌క్షుడు లూయిస్ రూబియేల్స్ లిప్ కిస్ ఇచ్చాడు. ఆ ఘ‌ట‌న పెను వివాదానికి దారి తీసింది. రూబియేల్స్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్లు వెల్లువెత్తాయి. పెద‌విపై ముద్దాడిన ఘ‌ట‌న త‌న‌ను బాధించిన‌ట్లు ఆ మ‌హిళా ప్లేయ‌ర్ తెలిపింది. కానీ స‌మాఖ్య నుంచి త‌ప్పుకునేందుకు రూబియేల్స్ నిరాక‌రించారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై స్పెయిన్ ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ఈ నేప‌థ్యంలో స్పెయిన్ ఫుట్‌బాల్ స‌మాఖ్య అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు రూబియేల్స్ ప్ర‌క‌టించారు. తాత్కాలిక అధ్య‌క్షుడు పెడ్రో రోచాకు త‌న రాజీనామాను అంద‌జేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

హెర్మోసోకు స్టేజ్‌పై లిప్ కిస్ ఇవ్వ‌డం స్పెయిన్‌లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఆ దేశం వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచినా.. దానికి గురించి పెద్ద‌గా చ‌ర్చించిన సంద‌ర్భమే లేకుండా పోయింది. రాజీనామా చేయాల‌ని ఎంత వ‌త్తిడి తెచ్చినా రూబియేల్స్ ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ లిప్ వివాదంపై హెర్మోస్ కోర్టును ఆశ్ర‌యించారు. లీగ‌ల్ కేసును దాఖ‌లు చేయ‌డంతో.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు చివ‌ర‌కు అత‌ను అంగీక‌రించాడు. ఇష్ట‌పూర్వ‌కంగానే హెర్మోస్‌కు కిస్ ఇచ్చిన‌ట్లు రూబియేల్స్ పేర్కొన్నా.. అది త‌న అంగీకారం లేకుండా జ‌రిగిన‌ట్లు ఆ క్రీడాకారిణి ఆరోపించారు. రూబియేల్స్ అధ్య‌క్షుడిగా ఉంటే.. తాము దేశం కోసం ఆడ‌బోమ‌ని 23 మంది వ‌ర‌ల్డ్ క‌ప్ ప్లేయ‌ర్ల‌తో పాటు మ‌రో 81 మంది స్పెయిన్ క్రీడాకారిణిలు తెలిపారు.

One Comment

  1. Wow, fantastic weblog layout! How lengthy have you ever
    been blogging for? you make running a blog look easy.
    The full look of your site is magnificent, let alone
    the content material! You can see similar here
    e-commerce

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button