తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

Lionel Messi: రెండు గోల్స్ కొట్టిన మెస్సీ… 10 నిమిషాలకే ఓ గోల్

అర్జెంటీనా కెప్టెన్‌ లియోన‌ల్ మెస్సీ మైదానంలో చిరుత‌లా క‌దిలి అత‌ను ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టించి గోల్ సాధించ‌డంలో దిట్ట‌. ఇప్ప‌టికే ఈ స్టార్ ప్లేయ‌ర్ త‌న మార్క్ గోల్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు మ‌రోసారి మ్యాజిక్ చేశాడు.

అర్జెంటీనా ప్లేయ‌ర్‌ మెస్సీ మ‌ళ్లీ మాయ చేశాడు. పెరూతో జ‌రిగిన 2026 వ‌రల్డ్‌క‌ప్ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో విజ‌యం సాధించింది. లీమాలో జ‌రిగిన మ్యాచ్‌లో .. ఆ రెండు గోల్స్ మెస్సీనే చేశాడు. అద్భుత‌మైన రీతిలో ఆట‌ను ప్ర‌ద‌ర్శించాడు.

36 ఏళ్ల మెస్సీ ఓ ద‌శ‌లో త‌న డ్రిబుల్ గేమ్‌తో ఇద్ద‌రు పేరూ ప్లేయ‌ర్ల‌ను ఆటాడుకున్నాడు. ప‌రాగ్వేతో జ‌రిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న మెస్సీ.. పెరూతో మ్యాచ్‌లో పూర్తి స‌మ‌యం ఆడాడు. ఇటీవ‌ల కుడి కాలుకు గాయం కావ‌డంతో చాన్నాళ్లు అత‌ను ఆట‌కు దూరంగా ఉన్నాడు. పెరూతో మ్యాచ్‌లో 32వ నిమిషంలో తొలి గోల్ చేసిన మెస్సీ.. ఆ త‌ర్వాత 10 నిమిషాల‌కే మ‌రో గోల్ కొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button