తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

Premier League: అదిరిపోయే గోల్ కొట్టిన గర్నాచో… వీడియో వైర‌ల్

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప్రీమియ‌ర్ లీగ్‌లో మాంచెస్ట‌ర్ యునైటెడ్ యువ ఫుట్‌బాల‌ర్ కండ్లు చెదిరే గోల్ కొట్టాడు. 19 ఏండ్ల వింగ‌ర్ అలెజాండ్రో గ‌ర్నాచో గాల్లోకి ఎగిరి బైసికిల్ గోల్ చేశాడు. అత‌డి విన్యాసాన్ని చూసి స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అనంత‌రం గ‌ర్నాచో ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డో త‌ర‌హాలో ‘సియూ’ సెల‌బ్రేష‌న్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

గ‌ర్నాచో బైసికిల్ గోల్ వీడియో

ఆదివారం ఎవ‌ర్టన్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో గ‌ర్నాచో మెరుపులా క‌దిలాడు. ఆట మొద‌లైన మూడో నిమిషంలోనే ఈ యంగ్‌స్ట‌ర్ 15 అడుగుల వ‌ల‌యం నుంచి బైసికిల్ గోల్ చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరిన గ‌ర్నాచో బంతిని త‌ల మీదుగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఎవ‌ర్ట‌న్ గోల్‌కీప‌ర్ ఆ బంతిని ఎలా అడ్డుకోవాలో తెలియ‌క చూస్తుండిపోయాడు. ఫుట్‌బాల్‌లో క‌ష్ట‌సాధ్య‌మైన ఆ గోల్ చేయడాన్ని తాను న‌మ్మ‌లేక‌పోయాన‌ని గ‌ర్నాచో మ్యాచ్ అనంత‌రం అన్నాడు. బైసికిల్ గోల్‌తో గ‌ర్నాచో 12 ఏండ్ల క్రితం ఇంగ్లండ్ లెజెండ్ వేన్ రూనీని గుర్తు చేశాడు. 2011లో, రూనీ అద్భుత గోల్ చేయ‌డంతో మాంచెస్ట‌ర్ సిటీపై ఓల్ట్ ట్ర‌ఫోర్డ్లో 2-1తో గెలుపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button