తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Pragathi: జాతీయ స్థాయిలో రాణించిన నటి ప్రగతి… పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం

టాలీవుడ్ క్యారెక్టర్ నటి ప్రగతి ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యమిస్తారని తెలుసుగానీ, ఏకంగా జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. షూటింగ్ లు లేకపోతే జిమ్ లో ఎక్కువగా గడిపే ప్రగతి నేషనల్ లెవల్ లో తన సత్తా ఏంటో చూపించారు. ఇటీవల బెంగళూరులో 28వ పురుషులు, మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రగతి మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా నిలిచింది.

Also Read: అదిరిపోయే గోల్ కొట్టిన గర్నాచో… వీడియో వైర‌ల్

ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించింది. ప్రస్తుతం ప్రగతి అనేక సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది.

ప్రస్తుతం తెలుగులో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. లాక్‌డౌన్ టైంలో ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. అయితే అవన్నీ సరదాకి అనుకున్నారు. ఇప్పుడు నిజంగానే పవర్ లిఫ్టర్ గా మారిపోయి అందరికీ షాకిచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button