తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: యాత్ర-2

Pakka Telugu Rating : 3/5
Cast : మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి తదితరులు
Director : మహి వి రాఘవ్
Music Director : సంతోష్ నారాయణన్
Release Date : 08/02/2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, వైసీపీ అధినేత, ప్రస్తుత ఆంధ్రా ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‍ రాజకీయ జీవితం ఆధారంగా, దర్శకుడు మహి.వి.రాఘవ యాత్ర-2 తెరకెక్కించారు. 2019 ఎన్నికల సమయంలో వచ్చిన యాత్ర సినిమా మంచి విజయాన్నే సాధించింది, అయితే ఇప్పుడు, మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, యాత్ర-2 సినిమా కోసం రాజకీయ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ: 

2009 ఎన్నికల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, తన తనయుడు వైస్ జగన్ మోహన్ రెడ్డిని కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజలకు పరిచయం చేయడంతో మొదలయ్యే సినిమా, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా ప్రమాణం చేయడంతో ముగుస్తుంది. ఆ మధ్యలో జగన్ చేసిన రాజకీయ “యాత్ర” ఈ సినిమా కథ. వైఎస్సార్ మరణం తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‘ఓదార్పు యాత్ర’ చేపడతారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేసిన జగన్‌కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎలాంటి గుణపాఠం చెప్పాలనుకుంది? జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? మరోవైపు చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2009 నుంచి 2019 మధ్యలో ఎలాంటి రాజకీయ సంఘటనలను చోటుచేసుకున్నాయి? వీటన్నింటినీ జగన్‌మోహన్‌రెడ్డి దాటుకుంటూ ప్రజా నాయ‌కుడిగా ఎలా ఎదిగాడు? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే.

క‌థ‌నం-విశ్లేషణ:

సినిమా క‌థాంశం ప‌రంగా చాలా సినిమాటిక్ యాంగిల్స్‌లో చూపించారు. అయితే అందరికి తెలిసిన కథ కావడంతో, స్క్రీన్ ప్లే పట్ల దర్శకుడు మరింత దృష్టి పెడితే బాగుండేది అనిపించింది. ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదనట్లు తెలుస్తోంది. కానీ, జగన్ ఢిల్లీ పెద్దలకు ఎదురువెళ్లడం, రాజకీయంగా ఎదిగిన తీరు ఆకట్టుకుంటోంది. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ వైఎస్ అభిమానుల‌కు న‌చ్చేలా ఉంటాయి. సీఎం జగన్ పడిన ఇబ్బంది, ఆయనపై అక్రమ కేసులు, ఆయన ఎదుర్కొన్న బాధ, కుటుంబం పడిన నరకయాతన కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రధానంగా మమ్ముట్టి జీవా మధ్య జరిగే సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయి. అయితే వైస్సార్, జగన్ కు ఉన్న అభిమాన‌గ‌ణానికి మాత్రం సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. దానికి తోడు చివ‌రి రెండు, మూడు నిమిషాలు జ‌గ‌న్‌ ఓదార్పు యాత్ర, పాదయాత్ర నిజ‌మైన సన్నివేశాల‌ను ఇన్‌క్లూడ్ చేసి చూప‌డం సినిమాకు ప్ల‌స్సే.

నటీనటులు:

జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. రాజకీయ ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో, అనుభవం ఉన్న రాజకీయ వేత్తగా హావాభావాలను చక్కగా పలికించాడు. అదే విధంగా వైఎస్‌ఆర్‌గా, తన నడక, అతని చేతి వేవ్‌తో సహా పాత్రను గుర్తుండిపోయేలా మమ్ముట్టి తప్పా ఎవరూ చేయలేరు. జీవా బాడీ లాంగ్వేజ్ అచ్చం జగన్ మాదిరిగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణన్, సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నార్డ్ ఫర్ఫెక్ట్‌గా కనిపించారు. ఇక రాజకీయాలు అవకాశవాదంగా ఉండాలని చూపించే చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంకా మిగతా నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

యాత్ర సినిమాతో ఆకట్టుకున్న మహి.వి.రాఘవ్‌, ఈ సినిమాలోను తనదైన మార్క్ చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. స్టోరీ, కంటెంట్ బాగున్నా.. అక్కడక్కడ కథ, పాత్రలు స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.. ఐతే ఈ సినిమాలో డైలాగ్స్ పెద్ద ప్లస్ పాయింట్. ఇక మది సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు, సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో స‌న్నివేశాల‌కు బ‌లాన్నిచ్చాయి. క్లైమాక్స్‌లో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం విజువల్స్‌ ఎమోషనల్‌ చేస్తాయి. 

ప్లస్ పాయింట్స్:

జీవా నటన

ఎమోషనల్‌ సీన్లు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సినిమాటోగ్రఫీ 

డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

తెలిసిన క‌థ‌, క‌థ‌నం

సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు

పంచ్‌లైన్:  వైఎస్ అభిమానులకు ఫుల్ మీల్స్! తండ్రి ఆశయం కోసం నిలబడిన తనయుడి “యాత్ర”.

7 Comments

  1. Excellent post. Keep writing such kind of information on your site.

    Im really impressed by your blog.
    Hey there, You’ve performed an excellent job.
    I will definitely digg it and in my view recommend to my friends.

    I am sure they will be benefited from this website.

    My web site: vpn coupon 2024

  2. Hi, I do believe this is a great blog. I stumbledupon it 😉 I will come back once again since I bookmarked it.
    Money and freedom is the greatest way to change, may you be rich and continue to guide other people.

    Also visit my web page: vpn special code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button