తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 08: చరిత్రలో ఈరోజు

జాకీర్ హుస్సేన్ జననం

స్వతంత్ర సమరయోధుడు, మూడవ భారత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1897 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. ఈయన బీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పనిచేశారు. 1952 నుంచి 1962 వరకు బీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా సేవలు అందించిన తర్వాత… 1962 నుంచి 1967 వరకు భారత ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆ తర్వాత 1967 మే 13న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.

Also Read: సీఎస్కే ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. ధోనీ రెడీ అవుతున్నాడు

మహమ్మద్ అజారుద్దీన్ పుట్టిన రోజు

భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. క్రికెట్‌లో రాణించి దేశానికి ఎన్నో విజయాలను అందించారు. కొంత కాలం పాటు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. అజారుద్దీన్ కెరీయర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో అతని పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దాంతొ తన క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. టీమిండియా తరుపున 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

కపిల్ దేవ్ అత్యధిక టెస్ట్ వికెట్ల రికార్డు

1994లో భారత క్రికెట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 432 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో రికార్డును కలిగి ఉన్నారు. న్యూజిలాండ్ క్రికెటర్ రిచర్డ్ హ్యాడ్లీ 431 టెస్టు వికెట్ల రికార్డును కపిల్ అధిగమించారు. అహ్మదాబాద్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఈ ఫీట్ సాధించారు.

Also Read: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఏది కావాలన్నా పొందొచ్చు

మంచికంటి రాంకిషన్ రావు మరణం

వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు మంచికంటి రామకిషన్ రావు 1995 ఫిబ్రవరి 8 వ తేదీన మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నాయకులైన మంచికంటి శాసనసభ్యునిగా కూడా పనిచేశారు.

జగ్జీత్ సింగ్ జయంతి

భారతీయ స్వరకర్త, గాయకుడు,సంగీతకారుడిగా ప్రఖ్యాతిగాంచిన జగ్జీత్ సింగ్ 1941 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. ఈయనను “గజల్ కింగ్”, “కింగ్ ఆఫ్ గజల్స్” గా పిలుస్తారు. ఈయన హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతి , నేపాలి భాషలలో పాడగలరు. ఈయనకు 2003లో పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఫిబ్రవరి 2014లో ప్రభుత్వం అతని గౌరవార్థం రెండు పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. 10 అక్టోబర్ 2011 సంవత్సరంలో ఈయన మరణించారు.

Also Read:  రైలు ప్రయాణికులకు భారీ ఊరట.. ఇక కష్టాలకు చెక్

మరికొన్ని విశేషాలు

  • సుప్రసిద్ధ కవి, పత్రికా సంపాదకుడు ఆండ్రా శేషగిరి రావు 1902 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. సాయిబాబా, త్యాగరాజు, భారతీ పుత్రి, వదిన లాంటి నాటకాలు ఈయన రచించారు. తెలుగు పత్రికా రంగ ప్రముఖుడైన పొత్తూరి వెంకటేశ్వరావు 1934 ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా పలు హోదాల్లో పనిచేశారు.
  • 1926లో డిస్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియోస్ పేరు వాల్ట్ డిస్నీ స్టూడియోస్ గా మార్చబడింది. 1971లో US NASDAQ, ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభించబడింది. 1948లో కెనడా 3-0తో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెయింట్ మోరిట్జ్ వింటర్ ఒలింపిక్స్‌లో ఒలింపిక్ ఐస్ హాకీ టైటిల్‌ను గెలుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button