తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Rituraj Singh: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్(59) గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు నటుడు అమిత్ బెహ్ల్ ధృవీకరించారు. గత కొంతకాలంగా ప్యాంక్రియాటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రితురాజ్ సింగ్..ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు.

ALSO READ: ‘బడే మియాన్ చోటే మియాన్’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ విడుదల

నటుడిగా గుర్తింపు..

రితురాజ్ బాలీవుడ్‌లో సినిమాలతోపాటు అనేక సీరియల్స్‌నూ నటించారు. ఈయన దాదాపు 50 టీవీ సీరియల్స్‌, వెబ్ సిరీస్‌లు, 11 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా బనేగీ అప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, ఆహత్, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్ వంటి అనేక వాటిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది తమిళంలో అజిత్‌ నటించిన తునివులో కూడా ఆయన నటించాడు. కాగా, ఆయన మరణవార్త తెలుసుకున్న టెలివిజన్‌ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button