తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

OM Bheem Bush: ముందుగానే ఓటిటిలోకి వస్తున్న ఓం భీం బుష్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో శ్రీవిష్ణు.. తాజాగా ఓం భీం బుష్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీ రోల్స్ చేయగా.. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా మర్చి 22న థియేటర్స్ లోకి వచ్చి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ మూవీ. కేవలం నాలుగురోజుల్లోనే రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మేకర్స్ పంట పండించింది.

Also read: Raghava Lawrence: మానవత్వం చాటుకున్న లారెన్స్.. నిరుపేద మహిళకు సాయం

ఇదిలా ఉంటే.. తాజాగా ఓం భీం బుష్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ మూవీ అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలో రానుందట. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఒప్పదం ప్రకారం ఈ సినిమాను థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే.. ఓపక్క ఐపీఎల్, మరోపక్క లేటెస్ట్ గా రిలీజైన టిల్లు స్క్వైర్ మూవీ. ఈ రెండు కారణాల వల్ల ఓం భీం బుష్ సినిమా థియేటర్స్ లో కలెక్షన్స్ రాబట్టే అవకాశం చాలా తక్కువ. అందుకే.. ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఓం భీం బుష్ సినిమా ఏప్రిల్ 19 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

Back to top button