తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గడ్డుకాలం.. మొదలైన కొత్త చిచ్చు!

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పొత్తు తమ అవకాశాలకు తీవ్రంగా గండి కొట్టిందని మూడు పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పొత్తు చిచ్చు పెడుతోంది. సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఆ పార్టీ కీలక నేతలకు అవకాశం దక్కకపోవడంతో వారంతా రెబల్స్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు నేతలైతే ఏకంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి సత్తా చాటుతామని ఇదివరకే ప్రకటించేశారు కూడా. వీరిని బుజ్జగించలేక.. బీజేపీ అధిష్టానానికి చుక్కులు కనిపిస్తున్నాయట. ఈ పరిస్థితి కేవలం బీజేపీలోనే కాదు, అటు టీడీపీ, ఇటు జనసేనలోనూ ఉంది.

ALSO READ: జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు..బాబుకు స్పందన కరువు!

ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో రెబల్స్ బెడద

కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా కూటమిలో అగ్గిరాజుకుంటోంది.వీటిలో శ్రీసత్య­సాయి జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో రెబల్స్ బెడద కూటమిని గందరగోళానికి గురిచేస్తున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున ధర్మవరం టికెట్‌ ఆశించి భంగపడ్డ వర­దాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనా­రా­యణ)కి ఎట్టిపరిస్థితిలోనూ తాను కూటమి తరుఫున ప్రచారం చేయనని చెబుతున్నారు. ఈ స్థానాన్ని వై. సత్యకుమార్‌కు ఖరారు చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే, తనకు టిక్కెట్ రాకుండా చేయడంలో టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కదిరి టిక్కెట్ ను ఆశించి భంగపడ్డ విష్ణువర్దన్ రెడ్డి సైతం తాను కూటమి తరుఫున ప్రచారం చేయనని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button