తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: దారిపొడవునా జనప్రవాహం.. జగన్‌కు అపూర్వ స్వాగతం!

శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి ఇవాళ బస్సు యాత్ర ప్రారంభమైంది. బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా కొనసాగుతున్న యాత్రలో సీఎం జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ స్టార్‌ క్యాంపెయిన­ర్లుగా మారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కదం తొక్కుతున్నారు. దీనికి ఐదో రోజు సత్యసాయి జిల్లాలో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం.

ALSO READ: పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే పెత్తందారులకు గిట్టదా?

మండుటెండైనా.. అర్ధరాత్రైనా

మండుటెండైనా.. అర్ధరాత్రైనా సీఎం జగన్‌ బస్సు యాత్రలో ప్రజలు లెక్క చేయకుండా నీరాజనాలు పలుకుతున్నారు. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే చేరవేశారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు, విపత్తు వేళ ఉచితంగా వైద్య సేవలు అందించడంతో సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయింది. నాయకుడంటే జగన్‌లా ఉండాలని ప్రజలే స్టార్‌ క్యాంపెయిన­ర్లుగా మారి చాటిచెబుతున్నారు. కాగా, మండుటెండల్లో వచ్చిన ఓ వృద్ధురాలికి నేనున్నానంటూ సీఎం జగన్ కొండంత భరోసా ఇచ్చారు.

ALSO READ: రాజకీయాలపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

వైసీపీలోకి టీడీపీ కీలక నేతలు

సత్యసాయి జిల్లాలో మొదలైన మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ నుంచి కీలక నేతలు చేరారు. ఈ మేరకు సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మాజీ జెడ్పీటీసీ, పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి తదితరులు వైసీపీలో చేరారు. ఆ తర్వాత బత్తలపల్లి చేరుకున్న వెంటనే అక్కడి ప్రజలు సంక్షేమ రథసారథి జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు తెలిపారు. దీంతో ప్రతి పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ బస్సు ఆపి ప్రజలకు అభివాదం చేశారు. అదే విధంగా ముదిగుబ్బలో జగన్‌కు పూల వర్షం కురిపించడంతోపాటు దారిపొడవునా గజమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. ఇక కదిరిలో ఇఫ్తార్‌ విందులో పాల్గొని మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్‌.ములకలపల్లె, చీకటిమనిపల్లె వెళ్లి అక్కడే రాత్రి బస చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button