తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Jagan Madanapalle Meeting: జిత్తుల మారి పొత్తుల ముఠా తయారైంది..నేరుగా దెబ్బ కొట్టలేకనే!

అరుంధతి సినిమాలో పశుపతి లాగే చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, ఐదేళ్ల తర్వాత సీఎం కుర్చీ కోసం వదల అంటూ కేకలు వేస్తున్నారని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో జిత్తుల మారి పొత్తుల ముఠా తయారైందని, వారితో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పేదల రక్తం పీల్చేందుకు చంద్రబాబు తన ముఠాతో సిద్ధమయ్యారని, జగన్‌ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

ALSO READ: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్..ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ

మళ్లీ అధికారంలోకి వస్తేనే..

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మళ్లీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. అదే విధంగా ప్రతినెల ఒకటోతేదీన చేతికి నగదు అందించే వలంటీర్ వ్యవస్థను తొలగించేందుకు పన్నాగం పన్నారన్నారు. ఎందుకంటే బాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై కక్ష్య పెంచుకున్నారన్నారు. ఇందులో భాగంగానే లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్‌ ఇవ్వడాన్ని అడ్డుకున్నారన్నారు.

ALSO READ: పింఛన్లు ఇవ్వనీయకుండా అడ్డుకుంటావా?

ఆలోచించి ఓటు వేయాలని పిలుపు..

డబుల్‌ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా? అంటూ జగన్ అడిగారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు రావాలని ఎక్కడా తగ్గేందుకు వీల్లేదని చెప్పారు. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో మీరందదరూ సముద్రంలా మదనపల్లెకు వచ్చారన్నారు. కూటమి ఇచ్చే రంగు రంగుల హామీలను నమ్మవద్దని, దోచుకోవడం.. దోచుకున్న సొమ్మును దాచుకోవడం కోసం సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. కావున రాబోయే ఎన్నికల్లో వేసే ఓటు మాత్రం తలరాతను మార్చే విధంగా మళ్లీ అన్నే రావాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత కథనాలు

Back to top button