తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Abu Dhabi: పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఎక్కడుందో తెలుసా?

గల్ఫ్ దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మరోసారి వార్తల్లో నిలిచింది. పశ్చిమా ఆసియాలో అతిపెద్ద హిందూ ఆలయం కలిగి ఉన్న దేశంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 700 కోట్ల వ్యయంతో, దుబాయి-అబుదాబి మార్గంలో 55వేల చదరపు మీటర్ల పరిధిలో దీనిని నిర్మించారు. భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ఆలయ విశిష్టతను మనం కూడా తెలుసుకుందామా.. మరి!

భారతీయ శిల్పకళ ఉట్టిపడేలా నిర్మాణం

ALSO READ: జై హనుమాన్ మూవీలో హీరో యశ్.. త్వరలో మూవీ టీం క్లారిటీ


బోచసన్వాసి అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ పేరిట యూఏఈలోని అబుదాబిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ హిందూ ఆలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది. 32.92 మీటర్ల (108 అడుగులు) ఎత్తు, 79.86 మీటర్ల (262 అడుగులు) పొడవు, 54.86 మీటర్ల (180 అడుగులు) వెడల్పుతో దీనిని ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఇక్కడి ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామి నారాయణుడు, వేంకటేశ్వరుడు, అయ్యప్ప కథలను వర్ణించారు. ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్‌ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్‌ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్‌ షాపులు ఏర్పాటు చేశారు.

మార్చి 1 నుంచి భక్తులకు అనుమతి

ALSO READ: జో బైడెన్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ లేఖ..


ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలను నిర్మించారు. అరబ్‌ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని గోపురాల నిర్మాణంలో వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారరు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు మనకు దర్శనమిస్తారు. ఈ అత్యద్భుత హిందూ ఆలయాన్ని భక్తులు మార్చి 1వ తేదీ నుంచి దర్శించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button