తెలుగు
te తెలుగు en English
మరిన్ని

America Politics: జో బైడెన్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ లేఖ..

అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధ్యక్షుడు జో బైడెన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్‌ పాట్రిక్‌ మోరిసే.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు లేఖ రాశారు. జ్ఞాపకశక్తి, వృద్ధాప్యంపై జో బైడెన్ గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దేశ పాలకుడిగా వ్యవహరించడం ఇబ్బందికరమని, ఆయనను పదవి నుంచి తొలగించాలని పాట్రిక్‌ మోరిసే కమలా హారిస్‌ను కోరారు.

ALSO READ: అమెరికాలో భారీగా మంచు తుపాను.. నిలిచిపోయిన జనజీవనం

ఇటీవల జరిగిన సమావేశాల్లో దేశాల పేర్ల విషయంలో జో బైడెన్ గందరగోళానికి గురయ్యారని పాట్రిక్‌ మోరిసే.. కమలా హారిస్‌కు రాసిన లేఖలో ఉదహరించారు. ‘బైడెన్‌ జ్ఞాపక శక్తిలో మార్పును అమెరికన్లు చాలా కాలంగా గమనిస్తున్నారు. బహిరంగ సభల్లో, విదేశీ నేతలతో సమావేశాల సమయంలోనూ స్పష్టంగా కనిపించింది. అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన అర్హులుకారని అర్థమవుతోంది.’ అని రాసుకొచ్చారు. మరోవైపు, అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమేనని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై డెమోక్రటిక్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి పాట్రిక్ లేఖపై, కమలా హారిస్ వ్యాఖ్యలపై జో బైడెన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button