తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Fraud: ‘పక్కింటి కుర్రాడు‘ యూట్యూబర్ అరెస్ట్

ప్రేమించి మోసం చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ (YouTuber) అరెస్టయ్యాడు. పుట్టినరోజు వేడుకకు పిలిచి అత్యాచారం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడనే కారణంతో ‘పక్కింటి కుర్రాడు’ (Pakkinti Kurradu) యూట్యూబర్ చందూసాయి అలియాస్ చంద్రశేఖర్ సాయికిరణ్ (Chandrasekhar Sai Kiran)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read  కాకినాడలో కాక రేపుతున్న రాజకీయం.. మరో ముగ్గురికి మూడింది

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad)లోని నార్సింగి ప్రాంతానికి చెందిన యువతికి చందూసాయి ప్రేమ పేరుతో చేరువయ్యాడు. ఈ క్రమంలోనే 25 ఏప్రిల్ 2021న పుట్టినరోజు (Birth Day) వేడుకకు అని పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని కాలం వెళ్లదీసి ఇప్పుడు కాదంటున్నాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయిచందును అదుపులోకి తీసుకున్నారు. చందుతోపాటు అతడి తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కేసు నమోదైంది.

Also Read ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్.. ఇరుకు ఇంట్లోనే బస

చందూసాయి నేపథ్యం
ఏపీలోని రాజమండ్రి పక్కన వేమగిరి (Vemagiri) ప్రాంతానికి చెందిన చందూ సాయి అసలు పేరు చంద్రశేఖర్ సాయికిరణ్. యూట్యూబ్ (YouTube)లో చందుగాడూ, పక్కింటి కుర్రాడు యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. అందులో వీడియోలు చేస్తూ పాపులరయ్యాడు. అనంతరం పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button