తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Indigo: విమానం ఆలస్యంపై ప్రయాణికుడు ఆగ్రహం.. సిబ్బందిపై పిడిగుద్దులు

విమాన ప్రయాణంలో ఓ ఉద్యోగిపై ప్రయాణికుడు దాడి చేశాడు. పిడిగుద్దులు కొడుతూ.. ఎగిరెగిరి అతడిని కొట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది అతడిని అడ్డుకున్నాడు. అంతలా అతడు కొట్టడానికి కారణం విమానం ఆలస్యమవుతుందని ప్రకటించడమే. విమాన ప్రయాణం ఆలస్యమవుతుందని ప్రకటిస్తున్న సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read మల్లేశ్ హత్య కేసు కాంగ్రెస్ తప్పించుకునే యత్నం: కేటీఆర్ విమర్శలు

ఢిల్లీ నుంచి గోవాకు ఇండిగో విమానం (6ఈ2175) వెళ్లాల్సి ఉంది. అయితే చలి ప్రభావం తీవ్రంగా ఉండడంతో పొగమంచు అలుముకుంది. ఈ పరిస్థితిలో విమానం వెళ్లడానికి అనుకూల పరిస్థితులు లేవని.. కొంత ఆలస్యమవుతుందని కో పైలెట్ అనూప్ కుమార్ వచ్చి మైక్ లో చెబుతున్నాడు. ఈ ప్రకటనపై విమానంలో ఉన్న ప్రయాణికుడు సాహిల్ కఠారియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపైకి దూసుకొచ్చాడు.

Also Read: మసీదుల కోసం పోరాడితే అల్లా సహాయం చేస్తాడు: అసదుద్దీన్

పిడికిలితో కో పైలెట్ పై దాడి చేశాడు. వెంటనే స్పందించిన మిగతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. సాహిల్ స్నేహితులు వచ్చి వెనక్కి తీసుకెళ్లాడు. కొట్టిన అనంతరం సాహిల్ విమాన సిబ్బందిపై బూతులతో విరుచుకుపడ్డాడు. ఈ దాడితో విమానంలో గందరగోళం ఏర్పడింది. ఈ సంఘటనపై వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని సాహిల్ కఠారియాను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు.

ఈ సంఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ‘ప్రయాణికుల వికృత ప్రవర్తన సరికాదు’ అని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని చెబితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, తమ సిబ్బందిపై దాడికి పాల్పడిన సాహిల్ ను తమ విమానాల నిషేధిత జాబితా (నోఫ్లై లిస్ట్)లో చేర్చాలని ఇండిగో భావిస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button