తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Pre Wedding Shoot: ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్.. డాక్టర్ సస్పెండ్

పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. ఆ సంబురానికి సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది. అదే ఫొటోషూట్‌. అయితే.. ఈ మధ్య ఫొటోషూట్‌ల ట్రెండ్‌ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, కపుల్‌ షూట్‌ తప్పనిసరి అయిపోయాయి. సినిమాలను మించి సెటప్‌లు, ఫోటో గ్రాఫర్స్, ప్రత్యేకంగా కొరియో గ్రాఫర్స్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా, కర్ణాటకలో ఓ డాక్టర్.. తాను పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్‌ను ఏర్పాటు చేశాడు.

ALSO READ: ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన వడ్డీరేటు

వైద్య సేవలే ముఖ్య ఉద్దేశం..

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేసే ఓ డాక్టర్..తనకు కాబోయే భార్యతో కలిసి ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లు వీడియోలు, ఫోటోలు తీయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆస్పత్రిలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించిన ఆ డాక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండు రావ్‌ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రజలకు వైద్య సేవలు అందజేయడమే ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని, వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదని మంత్రి స్పష్టం చేశారు. వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని మరిచి ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button