తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Robot: పనితనంతో ఆదరగొట్టిన రోబో … వీడియో వైరల్

హ్యూమనాయిడ్ రోబోల తయారీ రంగంలో టెస్లా దూసుకుపోతోందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. టెస్లా తయారుచేసిన కొత్తతరం హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఆప్టిమస్ రోబో ఓ చొక్కాను మడతపెడుతున్న దృశ్యం చూడొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టిమస్ రోబో ఈ పనిని పూర్తిగా తనకుతానుగా చేయగలిగే సామర్థ్యాన్ని పొందలేదని చెప్పారు.

Also Read:  హైదరాబాద్‌లో రెండు గంటల విద్యుత్ కోతలు… కారణం?

అయితే, త్వరలోనే స్వతంత్రంగా పనులు చేయగలిగే రోబోను తయారుచేయగలమని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.‘ఆప్టిమస్ ఫోల్డ్స్ ఏ షర్ట్’ పేరుతో మస్క్ ఈ వీడియోను షేర్ చేశారు. అయితే, దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. రోబో కదలికలు అచ్చంగా మనుషుల్లానే ఉన్నాయని ఓ యూజర్ కామెంట్ చేయగా. చాలా నెమ్మదిగా పనిచేస్తోందని ఆ రోబోను పక్కకు నెట్టి సదరు చొక్కాను మా అమ్మే మడతపెట్టేసిందని మరో యూజర్ కామెంట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button