తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

FIFA: ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్-2030 నిర్వహణకు పోటీపడుతున్న దేశాలివే?

ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రం త్వరలోనే క్రీడాభిమానుల‌ను అల‌రించ‌నుంది. ప్రస్తుతం ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 క్వాలిఫ‌య‌ర్ పోటీలు ఉత్కంఠగా జ‌రుగుతున్నాయి. కెన‌డా, మెక్సికో, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి ఇప్ప‌టికే పలు జ‌ట్లు అర్హత సాధించాయి. ఈ తరుణంలో 2030లో టోర్నీకి ఆతిథ్య‌మిచ్చేందుకు పలు దేశాలు పోటీ ప‌డుతున్నాయి. తాజాగా వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ కోసం మొరాకో, పోర్చుగ‌ల్, స్పెయిన్ దేశాలు 2030 ప్ర‌పంచ క‌ప్ పోటీల‌కు ఆతిథ్యమిచ్చేందుకు బిడ్స్ వేశాయని అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ స‌మాఖ్య తెలిపింది.

ALSO READ: వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లో భారత్ ఉమెన్స్ హాకీ జట్టు ఘన విజయం

నియ‌మ నిబంధ‌న‌ల మేరకే..

మొరాకో, పోర్చుగ‌ల్, స్పెయిన్ దేశాలు ఫుట్‌బాల్ స‌మాఖ్య నియ‌మ నిబంధ‌న‌ల‌కు అంగీక‌రించి బిడ్స్ వేశాయ‌ని రాయ‌ల్ మొరాకో ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ వెల్ల‌డించింది. గత ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఖ‌తార్‌లో జరగగా అర్జెంటీనా విజేత‌గా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైన‌ల్లో లియోన‌ల్ మెస్సీ సేన ఫ్రాన్స్‌ను ఓడించి మూడోసారి ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, టైట‌ల్ పోరులో హ్యాట్రిక్ గోల్స్‌తో ఫ్రాన్స్ స్టార్ ప్లేయ‌ర్ కిలియ‌న్ ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button