తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు

Pakka Telugu Rating : 3/5
Cast : సుహాస్, శివాని నగరం, శరణ్య ప్రదీప్, జగదీష్ ప్రతాప్ బండారి, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ తదితరులు
Director : దుష్యంత్ కటికినేని
Music Director : శేఖర్ చంద్ర
Release Date : 02/02/2024

సుహాస్, దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో తాజాగా విడుదలైన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. ఈ సినిమాలో సుహాస్ కు జోడీగా శివాని నాగారం నటించింది. కలర్ ఫోటో ఫేం సుహాస్ తో దుష్యంత్ కటికనేని మూవీ తెరకెక్కించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయానా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుహాస్‌, విభిన్నమైన చిత్రాలను నిర్మించడంలో ప్రఖ్యాతి చెందిన జీఎ2 బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Also read: Captain Miller: ఓటిటిలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కథ:

అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో మల్లి (సుహాస్) ఓ మెంబర్. చిరతపల్లిలో తన కుటుంబంతో నివస్తిస్తున్నాడు. అయితే సినిమాలో నిమ్న కులాల వివక్షత, ప్రేమకథతో కథను రూపొందించారు. మల్లి అక్క పద్మ(శరణ్య ప్రదీప్) ఆ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. అయితే ఆ ఊరి పెద్ద (నితిన్ ప్రసన్న) వల్లే ఆమెకు ఉద్యోగం వచ్చిందని, వారిద్దరికి అక్రమ సంబంధం ఉందని ఊరంతా అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మి(శివాని నాగారం), మల్లి ప్రేమలో పడతారు. వెంకట్ బాబు, మల్లి మధ్య గొడవలు, వైరం మధ్య పెరిగిపోతుంది. అందులోనే మల్లి, లక్ష్మి మధ్య ప్రేమ విషయం కూడా బయటకు రావడంతో మల్లి ఫ్యామిలీపై వెంకట్ బాబు పగ పెంచుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు రాత్రి పద్మన్ స్కూల్ కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత జరిగిన ఘటనలే ఈ సినిమా.

కథనం, విశ్లేషణ:

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా అద్భుతమైన లవ్ స్టోరీ, కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సమాజంలో కులవివక్ష అనే అంశంపైనే కథ తిరుగుతుంటుంది. అలాగే సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ను బాగా చూపించారు. ఇక సెకండాఫ్ లో కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. అప్పటివరకు ప్రేమకథపైనే సాగిన కథ.. ఇక ఆత్మాభిమానం అనే అంశంగా మారుతుంది. అందులో భాగంగానే మల్లి, అతని కుటుంబం సాగించే పోరాటాన్ని మంచి సన్నివేశాలు, డైలాగులతో డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు. పోలీస్ స్టేషన్ లో సాగే సన్నివేశాలు.. ప్రేమ ప్రాణాలను తీయకూడదు అంటూ సాగే సన్నివేశాలు చిత్రాన్ని పీక్ లెవల్స్ కి తీసుకెళ్తాయి.

Also read: Nikhil Siddarth: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. విషెస్ చెప్తున్న ఫ్యాన్స్

నటీనటులు:

మొదటిసారిగా డైరెక్షన్ చేసినా.. దుష్యంత్ హీరో సుహాస్ పాత్రను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో సుహాస్ మల్లి పాత్రకు ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. ఇక అబ్బాస్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాడి.. అలాగే కొన్ని సెంటిమెంటల్ సన్నివేశాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఇక హీరోయిన్ శివానీ నాగారం.. తన క్యారెక్టర్ ని అద్భుతంగా చేసింది. ఇక సుహాస్ కి అక్కడగా నటించిన శరణ్య ప్రదీప్ కూడా తన నటనతో, పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రాలకు ప్రాణం పోశారు.

సాంకేతిక వర్గం:

డైరెక్టర్ దుష్యంత్ కటికనేని చిత్రాన్ని ఎంతో ప్రభావంతంగా, అద్భుతంగా తెరకెక్కించడంలో సఫలమయ్యాడనే చెప్పొచ్చు. అలాగే మూవీ శేఖర్ చంద్ర రూపొందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మూవీకి బలం చేకూర్చాయి. కెమెరామెన్ వాజిద్ బేగ్ సన్నివేశాలను చాలా సహజంగా చిత్రీకరించారు. అలాగే మూవీలో వచ్చే కొన్ని డైలాగులు ప్రేక్షకులను హృదయానికి హత్తుకునేలా చేస్తాయి. అలాగే రాత్రి సన్నివేశాలను కూడా అద్భుతంగా రూపొందించారు.

ప్లస్ పాయింట్స్:

సుహాస్, శరణ్య నటన

కథ, కథనం

సంగీతం

ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

విలన్ క్యారెక్టర్

చిత్రంలోని కొన్ని సన్నివేశాలు

పంచ్ లైన్: మోత మోగిన.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button