తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Politics: పొత్తు కోసం బీజేపీతో చంద్రబాబు కాళ్ల బేరం… ఆ పార్టీ జతకడుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగలని ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కానీ ప్రతిపక్షాలు ఈ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోని బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యాయి. కానీ బీజేపీ కూడా తమతో కలుస్తుందని ఈ రెండు పార్టీలు చెప్పిన … బీజేపీ అధిష్టానం మాత్రం ఇంకా కాన్ఫామ్ చేయడం లేదు. ఈ విషయంపై తాడో పేడో తేల్చుకోవడానికి చంద్రబాబు, పవన్ ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రి అమిత్ షాలతో మంతనాలు జరుపుతున్నారు.

Also Read: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలివే..!

అయితే గతంలో చంద్రబాబు బీజేపీ పార్టీకి చేసిన ద్రోహన్ని ద‌ృష్టిలో ఉంచుకోని జాగ్రత్తగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అసలు చంద్రబాబుతో కలవడం బీజేపీకి ఇష్టం లేకపోయిన వీరిద్దరికి మధ్యవర్తిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం వల్ల పొత్తు పై పున:ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో జనసైనికులు పవన్ పై మండిపడుతున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు సీఎం కావడానికి పవన్ ను వాడుకుంటున్నడనే అభిప్రాయంలో వారు ఉన్నట్లు సమాచారం. కానీ చంద్రబాబుతో ఎప్పటికైనా ప్రమాదామే అని భావిస్తున్న బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

Also Read: మహిళా దినోత్సవం కానుక.. గ్యాస్ ధర తగ్గించిన ప్రధాని మోడీ

రాజకీయంగా తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ఢిల్లీలో చంద్రబాబు బీజేపీ పెద్దలను వేడుకోంటున్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ 9 నుంచి 11 లోక్ సభ స్ధానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్ధానాలకి పట్టుపడుతున్నట్లు సమాచారం. గత రెండేళ్లగా 11 లోక్ సభ స్ధానాలపై కేంద్ర మంత్రులు ఇన్‌చార్జ్‌లగా పనిచేశామన్నరని … విశాఖపట్నం, అరకు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట, తిరుపతి, హిందూపురం స్ధానాలపై తాము ఫోకస్ పెట్టామని బీజేపీ పెద్దలు అన్నట్లు తెలుస్తుంది. ఈ స్ధానాలలో 9 లోక్‌సభ స్ధానాలు ఇవ్వాల్సిందేనని వారు షరతు పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read: చివరి కేబినెట్ భేటీ.. కేంద్రం సంచలన నిర్ణయాలు!

ఎన్డీఏలో చేరడానికి ముందే గతంలో మోదీపై చేసిన విమర్శలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబుకి షరతులు విధించినట్లు… బీజేపీ షరతులకి ఓకే చెబితేనే ఎన్డీఏలో చేర్చుకుంటామని చంద్రబాబుకి అమిత్ షా స్పష్టం చేశారు. అయితే పదవి కోసం ఏం చేయడానికైనా సిద్దపడే చంద్రబాబు పదవి కాంక్షతో బీజేపీ పెట్టిన షరతులకు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి గతాన్ని ద‌ృష్టితో ఉంచుకొని చంద్రబాబుతో పొత్తు మనకెందుకనుకుంటారో లేక కూటమి ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగుతారో అనే విషయంలో నేడో, రేపో క్లారీటి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button