తెలుగు
te తెలుగు en English
జాతీయం

CBI: కవితకు బిగ్ షాక్…సీబీఐ విచారణకు కోర్టు అనుమతి

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. సీబీఐ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హాజరు కావాలంటూ కవితకు గతంలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు సంబంధించి తన పిటిషన్ కోర్టులో ఉందని… అందువల్ల తాను కోర్టుకు హాజరుకాలేనని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు.

Also Read: రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. దారిపొడవునా గుండెల నిండా ప్రేమ!

అయితే సీబీఐ వేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు సానుకూలంగా స్పందించింది. జైలులోనే ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. గతంలోనే తమ ఎదుట హాజరుకావాలని కవితకు సీబీఐ నోటిసులు ఇవ్వగా ఆమె వెళ్లలేదు.

Also Read: పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీలు… కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

వచ్చే వారం కవితను తీహార్ జైలులోనే సీబీఐ ప్రశ్నించనుంది. సీబీఐ అధికారులు జైలులోకి లాప్ టాప్, స్టేషనరీ తీసుకు వెళ్ళేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవితను విచారించాలని సీబీఐకి సూచించింది. బుచ్చిబాబు ఫోన్ లో దొరికిన సమాచారం ఆధారంగా కవితను సీబీఐ విచారించి ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేయనుంది. ఆప్ ఇచ్చిన రూ.100 కోట్ల వ్యవహారంపై కూడా సీబీఐ ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది.

Also Read: మరో సంచలన సర్వే.. వైసీపీకి ఎన్ని సీట్లంటే?

మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 8వ తేదీన కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గురువారం ఈడీ, కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. కాగా, మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 16న కోర్టులో హాజరు పర్చగా.. కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button