పోల్స్
డెవిల్ ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్పండి?
బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో మలయాళ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి అధికారిక ట్రైలర్ రిలీజైంది. డెవిల్… పేరుకు తగ్గట్టే కల్యాణ్ రామ్ ఈ చిత్రంలో భీకర పోరాటాలు చేశారని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. “విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా… లయన్” అంటూ కల్యాణ్ రామ్ పౌరుషంతో మీసం మెలేయడం ట్రైలర్ లో రోమాంఛకంగా అనిపిస్తుంది.