తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Republic Day: భారత్ కు షాక్.. గణతంత్ర వేడుకలకు బైడెన్ దూరం

భారతదేశానికి (India) ఊహించని పరిణామం ఎదురైంది. గణతంత్ర దినోత్సవానికి హాజరు కావాల్సిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) రావడం లేదని తెలిసింది. అనూహ్యంగా ఆయన గైర్హాజరవుతున్నారని అమెరికా (USA) వర్గాలు వెల్లడించాయి. గైర్హాజరుకు కారణం భారత్ లో నిర్వహించాల్సిన క్వాడ్ (Quad) సదస్సు వాయిదానే అని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read ప్రజలకు గద్గద స్వరంతో కేసీఆర్ విజ్ణప్తి

అమెరికా పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కోరారు. ఈ ఆహ్వానాన్ని బైడెన్ అంగీకరించి విధిగా హాజరవుతానని పేర్కొన్నారు. అయితే తాజాగా బైడెన్ హాజరయ్యేందుకు సుముఖంగా లేరని తెలిసింది. గణతంత్ర దినోత్సవం అనంతరం నిర్వహించాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది. రెండు కార్యక్రమాలకు ఒకేసారి హాజరుకావాలనే ఉద్దేశంతో బైడెన్ భారత్ పర్యటనకు (Tour) అంగీకరించారు. ఇప్పుడు క్వాడ్ సదస్సు వాయిదాతో గణతంత్ర వేడుకలకు (Republic Day) దూరమవుతున్నారు. క్వాడ్ సదస్సు 2024 చివరిలో నిర్వహించాలని భారత్ భావిస్తోంది. ఈ కారణం చేతనే బైడెన్ భారత్ పర్యటనకు రావడం లేదని సమాచారం. బైడెన్ గైర్హాజరయితే ఏ దేశ అధ్యక్షుడిని ఆహ్వానించాలనే అంశంపై విదేశాంగ శాఖ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది.

Also Read ఈ ఒక్క విషయంలో జగన్ మారితే సూపర్ సక్సెస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button