తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Dal Curry: బంగారంతో పప్పు కూర.. వైరలవుతున్న వీడియో

బంగారంతో తయారుచేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. రుచితోపాటు చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతోంది. అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన దాల్ రెసిపీ. ఈ కర్రీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also read: New Metro Plan: మెట్రో రైలు రూట్ మ్యాప్ లో మార్పులు.. రెండు స్టేషన్ల తొలగింపు

దుబాయ్ లోని ఫేమస్ సెలబ్రేటి చెఫ్ రణవీర్ బ్రార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అతని రెస్టారెంట్లోనే ఈ బంగారంతో తయారుచేసిన దాల్ కర్రీని తయారు చేస్తున్నారు. ప్రజల నుంచి మంచి ఆదరణను అందుకున్న ప్రత్యేకమైన వంట. ఈ రెసిపిని దాల్ కష్కన్ అని పిలుస్తారు. ఇందుకు గాను 24 క్యారెట్ల బంగారాన్ని వాడతారు.

ప్రస్తుతం ఈ వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో ఒక చెక్కపెట్టెలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేసిన పప్పును తీసుకువస్తారు. ఆ తర్వాత దానికి గోల్డ్ తో తయారు చేసిన నెయ్యిని పోస్తారు. ఈ వంటకం ధర మన కరెన్సీలో సుమారు రూ. 1300 ఉండొచ్చని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button