తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జనవరి 31: చరిత్రలో ఈరోజు

భారతదేశ జాతీయ పక్షిగా నెమలి

భారత దేశ జాతీయ పక్షి గా నెమలిని 1963 జనవరి 31న ప్రకటించారు. నెమలి శాస్త్రీయ నామం ‘ పావో క్రిస్టాటస్. నెమలి అనగానే మనకు గుర్తుకువచ్చేవి అందమైన ఈకలు. మగ నెమలికి మాత్రమే పొడవాటి ఈకలు ఉంటాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు.

Also Read: సముద్రంలో ఐఎన్ఎస్ సుమిత్ర సత్తా.. పాకిస్తానీ, ఇరాన్ నావికుల్ని కాపాడిన భారత్

వీధి బాలల దినోత్సవం

అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 31న నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని ఆస్ట్రియన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు జుగెండ్ ఐన్ వెల్ట్ ప్రారంభించారు. జాన్ బాస్కోకు కాననైజ్ చేయబడిన 75వ వార్షికోత్సవం సందర్బంగా ఈరోజును వీధి బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం యువతకు అత్యవసర సహాయం, ఆహారం, దుస్తులు, నివాసం, విద్య వంటివి అందించడం.

వనమాలి జననం

ప్రముఖ సినీ గేయ రచయిత అయిన వనమాలి 1974 జనవరి 31వ తేదీన జన్మించారు. హ్యాపీడేస్ చిత్రానికి గేయరచయితగా తొలి ఫిలిం ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు ఈయన పాటలు రాశారు.

Also Read: మాల్దీవులకు భారత్ దెబ్బ.. భారీగా పడిపోయిన పర్యాటకులు

ప్రీతీ జింటా పుట్టిన రోజు

ప్రముఖ సినీ నటి ప్రీతిజింటా 1975 జనవరి 31వ తేదీన జన్మించారు. మోడల్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రీతిజింటా ఆ తర్వాత కథానాయిక ఎన్నో ఏళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగారు. బాలీవుడ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు సరసన రాజా కుమారుడు సినిమాలో నటించారు. స్టార్ హీరోల సరసన నటించిన ప్రీతిజింటా… తనదైన అందం అభినయంతో ఎంతో క్రేజ్ సంపాదించారు.

టైటిల్ గెలిచిన బాక్సర్ జో లూయిస్

అమెరికన్ బాక్సర్ జో లూయిస్ NYSAC హెవీవెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను గెలుచుకున్న రోజు నేడు. న్యూయర్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ లో 1941లో జరిగిన హోరాహోరి ఫైట్ లో రెడ్ బర్మను చివరికి నాకౌట్ చేశాడు. దాంతో జో లూయిస్ ఖాతాలో 13వ టైటిల్ వచ్చి చేరింది.

Also Read: కన్నుల పండువగా నాగోబా జాతర.. భారీగా తరలివస్తున్న ఆదివాసీలు

మరికొన్ని విశేషాలు

  • ప్రముఖ ఆర్ధికవేత్త అయిన రాగ్నర్ ఫిష్ 1895 జనవరి 31వ తేదీన జన్మించారు.1930 లో ఆర్థిక సమస్యల సాధనకై గణాంక శాస్ర్త ఆధారిత ఫార్ములాను ఉపయోగించి ఎకనామెట్రిక్స్ శాస్త్రానికి అంకురార్ఫణ చేశారు. 31 జనవరి 2010లో హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ రెండు బిలియన్ డాలర్లు సంపాదించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
  • ప్రముఖ తెలుగు రచయిత కవి అయిన కందుకూరి రామభద్రరావు 1905 జనవరి 31వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు భాషలో ఎన్నో రచనలు కవిత్వాలు రాసి తెలుగు ప్రజలకు అందించారు. ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కథానాయక రక్ష పుట్టిన రోజు నేడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 50 చిత్రాలకు పైగా నటించారు. తెలుగులో నచ్చావులే, పంచదార చిలక, ప్రేమలేఖ లాంటి చిత్రాల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button