తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 24: చరిత్రలో ఈ రోజు

ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం

ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం నేడు నిర్వహిస్తుంటారు. భయంకరమైన టీబీ (క్షయ) భారత్ లో ప్రతి సెకనుకు ఒకరికి సోకుతుందని, ప్రతి రోజు దాదాపు 1000 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1962 తొలిసారిగా క్షయవ్యాధి నివారణకు భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 1882 మార్చి 24న డా. రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికారక సూక్ష్మజీవులు (మైకోబ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్)ను మొదటిసారిగా కనుగొన్నాడు. 1982లో క్షయ వ్యాధి బ్యాక్టీరియాను కనుగొని 100 సంవత్సరాలైన సందర్భంగా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది.

Also Read: ట్రాక్ పై ఆగిపోయిన రైలు.. నెట్టుకుంటూ వెళ్లిన ఉద్యోగులు

ముత్తుస్వామి దీక్షితులు పుట్టినరోజు

కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, వీణ విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితులు 1775లో జన్మించారు. వీరి కీర్తనలు ఎక్కువగా సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని కృతులు తమిళము, సంస్కృతం సమ్మేళనంలో కూడా రాయబడ్డాయి. “గురు గుహ” అనేది వీరి మకుటం. వీరి అన్ని రచనాల్లోనూ అది కనిపిస్తుంది. వీరు మొత్తం 500లకు పైగా కీర్తనలు రాశారు. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి.

గ్రంథి సుబ్బారావు మరణం

ప్రముఖ వ్యాపారవేత్త, క్రేన్ వక్కపొడి ఉత్పత్తి సంస్థల అధిపతి గ్రంథి సుబ్బారావు 2017 గుంటూరులో మరణించారు. ఈయన 1930 గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో జన్మించారు. మొదటగా వాణి వక్క పలుకులు అనే పేరుతో 100 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. తరువాత వ్యాపారంలో పోటీ పెరిగింది. దాంతో పేరును నంబర్ 1 వాణి వక్కపొడి అని పేరు మార్చాడు. ఈ వ్యాపారం మొట్టమొదటగా మంగళగిరిలోప్రాచుర్యం పొందింది. 1952లో స్థాపించిన క్రేన్ కంపెనీ 50 ఏళ్ళలో వందల కోట్ల కంపెనీగా ఎదిగింది.

Also Read: యువతుల రీల్స్ పిచ్చి… పబ్లిక్‌లో ఏం చేశారో చూడండి!

మరిన్ని విశేషాలు

  • మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎన్. పోపోవ్ 1896లో సృష్టించారు.
  • భారత ప్రధానమంత్రిగా 1977లో మొరార్జీ దేశాయ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
  • భారత లోక్ సభ స్పీకర్ గా జిఎంసీ. బాలయోగి 1998లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
  • భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డీసౌజా 1984లో జన్మించారు.
  • మలయాళ హాస్య నటుడు వి.డి. రాజప్పన్ 2016లో కన్నుమూశారు.
  • బెంగాళీ సినిమా నటుడు అభిషేక్ ఛటర్జీ 2022లో చనిపోయారు.
  • ఇంగ్లాండ్ మాహారాణి ఎజిజబెత్-1 1603లో మరణించారు.
  • పశ్చిమ బెంగాళ్ దంతన్ ప్రాంతంలో 1998లో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది మరణించగా.. 3000 మంది గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button