తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana: ‘ప్రెట్టీ కూల్’… వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

దేశీయ పారిశ్రామిక దిగ్గజం ‘ఆనంద్ మహీంద్రా’ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేశారు.

Also Read: తెలంగాణ పోలీసుల రికార్డ్.. దేశంలోనే నెం.1

తొలి రాష్ట్రం తెలంగాణ

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త టెక్నాలజీ ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచంలో స్మార్ట్‌ బ్యాగేజీ ట్రాలీ సదుపాయాన్ని తొలిసారిగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండో ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్ కావడం విశేషం.

ట్రాలీ ప్రత్యేకలు

ఈ ట్రాలీపై ఉన్న డ్యాష్ బోర్డులో మన బోర్డింగ్ పాస్ వివరాలను ఎంటర్ చేస్తే.. ఫ్లైట్ టైమింగ్స్‌తో పాటు గేట్ నంబర్ వివరాలు కూడా స్క్రీన్‌ మీద కనిపిస్తాయి. గేట్ వద్దకు చేరుకొనే మార్గాన్ని కూడా అదే చూపుతుంది. బోర్డింగ్‌‌కు టైమ్ ఉంటే షాపింగ్ చేసుకునేందుకు వీలుగా అన్ని వివరాలు డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో షాపులు, దాని వివరాలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకోవచ్చు. వాటితో పాటు వాష్ రూంలు, రెస్టారెంట్లు, ఫుడ్ వివరాల గురించి వివరాలు కనిపిస్తాయి.

Also Read:  రైతు బంధుపై గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు… వారికి ఈ పథకం అవసరం లేదు

ఆనంద్ మహీంద్రా ట్వీట్..

స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఈ టెక్నాలజీ చాలా బాగుందని, విదేశాల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ చూడలేదని ఇది ‘ప్రెట్టీ కూల్’ అంటూ పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button