తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana Government: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం నేటితో గడువు ముగుస్తుండడంతో మరో పది రోజులు పాటు గడవు పెంచింది. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 20 వరకు గడువు విధించింది. అంతేకాకుండా ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఎడిట్ ఆప్షన్ కూడా కలిపించింది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ సూచించింది.

Also read: Rain Alert: తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు.. చల్లబడిన వాతావరణం

మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 72,771 దరఖాస్తులు రాగా.. పేపర్ 2కు 1,20,364 వచ్చాయి. 2016లో నిర్వహించిన టెట్ కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83 దరఖాస్తులు వచ్చాయి. టెట్‌ పరీక్ష మే 20 నుంచి జూన్‌ 3 వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్‌ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button