తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 8: చరిత్రలో ఈరోజు

కె. జయరామన్ పుట్టినరోజు

కేరళకు చెందిన భారతీయ క్రికెటర్ జయరామన్ 1956 ఏర్నాకులంలో జన్మించారు. 1977-1989 కాలంలో కేరళ తరపున 46 ఫస్ట్- క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 1980 లో కేరళ జట్టులో ప్రముఖ ఆటగాడిగా ఉన్నారు. 1986- 87 లో రంజీ ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. భారత జట్టు ఎంపికకు దగ్గరగా వచ్చిన మొదటి కేరళ ఆటగాడిగా నిలిచారు. కేరళ కెప్టెన్, కేరళ క్రికెట్ సెలెక్టర్ల చైర్మన్‌గా పనిచేశారు. జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.

అల్లు అర్జున్ పుట్టినరోజు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన 1982లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జన్మించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. హాస్యనటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. చిన్నప్పుడే విజేత సినిమాలో బాలనటుడి పాత్రలో మొదటిసారిగా కనిపించాడు. హీరోగా అల్లుఅర్జున్ చేసిన మొదటి చిత్రం గంగోత్రి. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమా 2021లో విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ది రైజ్‌లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఇతడు, తెలుగు సినిమారంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా నిలిచాడు.

కోఫీ అన్నన్ పుట్టినరోజు

ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ 1938 ఘనాలోని కుమాసిలో జన్మించారు. ఐక్యరాజ్య సమితికి 7వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆఫ్రికా ఖండం నుంచి ఆ పదవికి ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు కూడా ఈయనే. ఆయన సేవలకు గాను 2001లో ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.

నిత్యా మేనన్ పుట్టినరోజు

భారతీయ నటి, గాయని నిత్యా మేనన్ 1988 బెంగళూరులో జన్మించింది. కన్నడ, తమిళ, మలయాళ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. అలామొదలైంది సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరచియమైంది.

జాన్ రిచర్డ్ హిక్స్ పుట్టినరోజు

బ్రిటిష్ ఆర్థిక వేత్త సర్ జాన్ హిక్స్ 1904 ఇంగ్లాండులోని లీమింగ్టన్ స్పాలో జన్మించారు. 20వ శతాబ్దపు అతి ముఖ్యమైన, ప్రభావమంతమైన ఆర్థికవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో వినియోగదారుల డిమాండ్ సిద్ధాంతం, IS-LM మోడల్ (1937), స్థూల ఆర్థిక శాస్త్రం కీనేసియన్ దృక్పథాన్ని సంగ్రహించిన ఆర్థిక శాస్త్ర రంగంలో అతను చేసిన అనేక రచనలలో బాగా ప్రసిద్ధి పొందాయి. ఆర్థిక రంగంలో ఆయన చేసిన కృషికిగాను 1972లో ఆర్థశాస్త్ర విభాగం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్నారు.

అనంత్ శ్రీరామ్ పుట్టినరోజు

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ 1984 ప.గో. జిల్లా దొడ్డిపట్లలో జన్మించారు. 12 ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించారు. 2014 వరకే 195 చిత్రాలకు 558 పాటలు రాశారు.

అక్కినేని అఖిల్ పుట్టినరోజు

టాలీవుడ్ లో యంగ్ హీరో అక్కినేని అఖిల్ 1994 అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించి హైదరాబాద్ లో పెరిగారు. ఈయన తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అమల దంపతులు. 1994లో వచ్చిన సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి పేరు తెచ్చుకున్నారు. హీరోగా ఆయన చేసిన మొదటి సినిమా అఖిల్.

బంకించంద్ర ఛటర్జీ మరణం

వందేమాతరం గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ 1894 కలకత్తాలో మరణించారు. ఛటోపాధ్యాయ్ ను బ్రిటీష్ వారు సరిగా పలకలేక.. ఛటర్జీ అని పిలువసాగారు. ఈయన 1838 జూన్ 27న బెంగాల్ ప్రెసిడెన్సీ నైహతిలో జన్మించారు. బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు. వందేమాతరం గేయం ఇతనికి మంచిపేరు తెచ్చింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు.

మంగళ్ పాండే మరణం

ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ సిపాయి. ఈయన 1857 లో మరణించారు. చిన్నతనంలో శాస్త్రాధ్యయనం వద్దనుకొని శస్త్ర విద్యను అభ్యసించారు. ఈయన 1827 జూలై 19న అవధ్ లోని నగ్వా బల్లియాలో జన్మించారు. తాను 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే బ్రిటీషు వారి సైన్యంలో చేరాడు. తాను చూపించిన అద్వితీయ ప్రతిభతో అనదికాలంలోనే తాను సైనిక దళ నాయకుడా ఎన్నుకోబడ్డాడు. కలకత్తా దగ్గర బారక్ పూర్ వద్ద 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు.

శంకరంబాడి సుందరాచారి మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి 1977 తిరుపతిలో మరణించారు. ఈయన 1914లో ఆగస్టు 10న తిరుపతిలో జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిని తెలుగులోకి అనువదించారు. ఎన్నో పద్యాలు, కావ్యాలు, గేయాలు రచించారు.

మార్గరెట్ థాచర్ మరణం

యునైటెడ్ కింగ్ డమ్ తొలి మహిళా ప్రధానిగా దీర్ఘకాలం సేవలందించిన మార్గరెట్ హిల్డా థాచర్ 2013 ఇంగ్లాండ్ లోని లండన్ లో మరణించారు. ఈమె 1925 అక్టోబర్ 13న ఇంగ్లాండ్ లో జన్మించారు. వ్యక్తిగత, రాజకీయ కఠినత్వం వల్ల ఆమె ఉక్కు మహిళ (ఐరన్ లేడీ) గా పేరు పొందారు. రాజీలేని రాజకీయాలు, నాయకత్వ శైలితో థాచెరిజం అని పిలువబడే విధానాలను అమలు చేశారు. 1979 సార్వత్రిక ఎన్నికలలో గెలిచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె అధిక ద్రవ్యోల్బణం, ఆర్దిక మాంద్యం నేపథ్యంలో తన శైలి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు.

మరిన్ని విశేషాలు

‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’అనే గేయాన్ని రచించిన వేములపల్లి శ్రీకృష్ణ 2000 సంవత్సరం హైదరాబాద్ లో మరణించారు.

ప్రసిద్ధ కవి, పండితులు, న్యాయవాది దాసు శ్రీరాములు 1846 కృష్ణా జిల్లా కూరాడలో జన్మించారు.

ప్రజారక్షణ, వ్యాపార వివాదాల చట్టాల ఆమోదానికి నిరసనగా 1929 లో భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభలోకి బాంబులు విసిరారు.

భారత్, పాకిస్తాన్ 1950లో లియాఖత్- నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా పెరుకెక్కిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన. అందులో 2 వేల మంది మరణించారు. ఘటనపై 1985 లో ఙారత్ యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button