తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Viral Video: వీడు మాములోడు కాదు.. రివర్స్ డ్రైవింగ్ చేస్తూ ఎస్కేప్

సినీ ఫక్కిలో ఓ కారు డ్రైవర్ రివర్స్ డ్రైవింగ్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని హైవేపై పోలీసులు కారును వెంబడిస్తున్న వీడియా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఘజియాబాద్ పోలీసులు హైవేపై కారును వెంబడించడం, కారు డ్రైవర్ తన కారును రివర్స్ డైరెక్షన్ లో నడుపుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం బాలీవుడ్ సినిమా సన్నివేశాలను ఈ వీడియోలో చూడొచ్చు.

Also read: Medaram Jathara: భక్తులతో కిక్కిరిసిన మేడారం.. జాతరలో నేడు కీలక ఘట్టం

దాదాపు 42 సెకన్ల ఈ వీడియోలో ఘజియాబాద్ హైవే పై కారును పోలీసులు వెంబడించడం, కారు డ్రైవర్ రివర్స్ డైరెక్షన్ లో కారు నడుతున్నట్లు కనిపిస్తుంది. కారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఘజియాబాద్ పోలీసులు కారు డ్రైవర్ ను పట్టుకోలేకపోయారని.. కారు డ్రైవర్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడని ఈ వీడియోలో పేర్కొన్నారు. రోడ్డు అవతలి వైపు డ్రైవింగ్ చేస్తున్న మరో కారు డ్రైవర్ ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇది నిజంగా బాలీవుడ్ సినిమాలో ఓ సీన్ లా అనిపించిందని రాశారు. మరో నెటిజన్ స్పందిస్తూ ఇది సినిమాలోని సన్నివేశం కాదు.. ఇది ఇన్ స్టా గ్రామ్ రీల్ అయి ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ వీడియోపై ఘజియాబాద్ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అదృష్టవశాత్తు పోలీసుల ఛేజింగ్ లో ఎవరికీ గాయాలు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button