తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Viral Video: దారుణం.. పిల్లల్ని తొక్కుకుంటూ వెళ్లిన స్కూల్ బస్సు

ముంబైలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు చిన్నారులు రోడ్డుపై వెళ్తుండగా మూలమలుపు తిరుగుతున్న ఓ స్కూల్ బస్సు వారిని తొక్కుకుంటూ వెళ్లింది. ముంబై పక్కనున్న వసాయ్ లో శుక్రవారం మధ్యాహ్నం జరింగింది. సెయింట్ అగస్టిన్ హైస్కూల్‌కు చెందిన బస్సు డ్రైవర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు పిల్లల్ని చూడకుండా నెమ్మదిగా వచ్చి వారిపైకి ఎక్కించాడు. ఇద్దరు పిల్లలూ ఎవరి సహాయం లేకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు.

Also read: Google: గూగుల్ ప్లే స్టోర్ నుంచి పలు యాప్స్ తొలగింపు.. అసలు కారణమేంటి?

బస్సు ముందు టైర్ వారిపై నుంచి వెళ్లిన తర్వాత అప్పుడు డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఘటన అనంతరం డ్రైవర్ బస్సును వదిలి పరారయ్యాడు. బస్సు కిందపడిన చిన్నారుల్లో నాలుగేళ్ల పాప, రెండేళ్ల బాబు ఉన్నాడు. గాయపడిన వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button