తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Shoaib Malik: సానియా మీర్జాకు ఊహించని షాక్‌.. మరో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ క్రికెటర్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఊహించని షాక్‌ తగిలింది. ఆమె భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా, ఇటీవల భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడిపోయారనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా, పాకిస్తాన్‌ నటి సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ: స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు కరోనా.. మ్యాచ్‌కు దూరం

పెళ్లి ఫొటోె వైరల్

పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ అయిన షోయబ్ మాలిక్, ఇండియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలు 2010లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఒక బాబు సంతానం. అంతకుముందు 2002లో అయేషా సిద్ధిఖీని వివాహమాడిన మాలిక్.. 2010లో విడిపోయి సానియాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టు 20వ తేదీన షోయబ్, సనా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం. శనివారం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాలిక్ పంచుకున్నారు. ఇందులో ‘అహ్మ‌దుల్లా.. మేము ఒక్క‌ట‌య్యాం’ అని క్యాప్ష‌న్ రాశాడు. దీంతో సానియాకు మాలిక్ విడాకులు ఇచ్చాడా? లేదా? అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. కాగా, దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

One Comment

Leave a Reply to novoluxe.top Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button