Fighter: హీరో హృతిక్ రోషన్ పుట్టినరోజు… వివిధ కార్యక్రమాలు చేపట్టిన ఫ్యాన్స్
జనవరి 10న హీరో హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా హృతిక్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్ ను గ్రాండ్ గా చేశారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజును పురస్కారించుకొని హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఉన్న కొన్ని అనాధాశ్రమాలలో ఫుడ్ డొనేట్ చేశారు. అలాగే మంగళగిరి, వైజాగ్ లో మొక్కలు నాటడం జరిగింది. చెన్నై, హైదరాబాద్ , విజయవాడ సిటీలలో కేక్ కటింగ్స్ చేశారు.
Also Read: ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనపడుతుందా?
చెన్నై సిటీలో ట్రక్ లో ఫుడ్ ను డిస్ట్రిబ్యూషన్ చేశారు. తమ అభిమాన హీరో సినిమా ఫైటర్ జనవరి 25న విడుదల అవుతున్న సందర్బంగా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆయన ఫాన్స్ కోరుకున్నారు. ఈ మూవీలో హృతిక్ కి జోడిగా దీపికా పదుకొనె నటిస్తుంది.హీరోయిన్ గా యువ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా మూవీ ఫైటర్. మొదటి నుంచి భారీ అంచనాలను నెలకొల్పిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థల పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.