తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్ప్రత్యేక కథనం

Jagapathi Babu: ఆ విషయంలో తప్పు చేశానని ఫీలవుతా: జగపతి బాబు

టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘లెజెండ్‌’తో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జగపతి బాబు కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పవచ్చు. అయితే, ఈ సక్సెస్‌ను తాను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినట్లుగా ఆయన వాపోయారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘లెజెండ్‌’ తర్వాత నేను ఎన్నో పాత్రల్లో నటించాను. అందులో కొన్ని మాత్రమే చెప్పుకోదగ్గవి చేశాను. లెజెండ్‌లో చేసిన శక్తిమంతమైన పాత్రల వంటివే మరిన్ని చేసుంటే బాగుండేది’ అని అన్నారు.

ALSO READ:  ఓటీటీలోకి విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాగా.. బోయపాటి శీను దర్శకత్వంతో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీ 2014లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఇందులో మొట్టమొదటిసారి జగపతి బాబు విలన్ పాత్రలో నటించారు. ఫ్యామిటీ మ్యాన్‌గా కనిపించిన జగపతి బాబు విలన్‌ ఏంటి? అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీలో ఆయన అద్భుతంగా నటించారు. తన నటన ద్వారా విలన్‌గా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button