తెలుగు
te తెలుగు en English
మరిన్ని

ISSF World Cup : దివ్యాన్ష్ సింగ్ ప్రపంచ రికార్డు.. స్వర్ణం గెలిచిన షూటర్

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అంత‌ర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ స‌మాఖ్య‌ వ‌ర‌ల్డ్ క‌ప్‌(ISSF World Cup)లో షూటర్ దివ్యాన్ష్ సింగ్ ప‌న్వార్ అద‌ర‌గొట్టాడు. రికార్డు స్కోర్‌తో దేశానికి రెండో బంగారు ప‌త‌కం అందించాడు. ఈజిప్ట్‌లో జ‌రిగిన‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ సిటీ షూటింగ్ 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ పిస్ట‌ల్ ఫైన‌ల్లో దివ్యాన్ష్‌ రికార్డు స్కోర్ సాధించాడు. ప్రతి షూట్ లోనూ అతను 10 కంటే తక్కువ స్కోర్ నమోదు చేయలేదు. మొత్తంగా దివ్యాన్షుకు ఇది 5వ వరల్డ్ కప్ స్వర్ణం.

Also Read: చెలరేగిన ఇంగ్లండ్ స్పిన్నర్ హార్ట్ లే… టీమిండియా ఓటమి

24 షూట్ల‌లో 21 ఏండ్ల దివ్యాన్ష్ 253.7 స్కోర్‌తో చైనాకు చెందిన షెంగ్ లిహా వో రికార్డును బ్రేక్ చేశాడు. దాంతో, షెంగ్ గ‌తంలో 253.3 స్కోర్‌తో రెండో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు. ఇట‌లీ షూట‌ర్ డానీ సొల్లాజో 1.9 స్కోర్‌తో వెండి ప‌త‌కం గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button