Coco Gauff: మరో సంచలనం.. ఆక్లాండ్ క్లాసిక్ టైటిల్ నెగ్గిన కొకొ గాఫ్
అమెరికన్ టెన్నిస్ అంటేనే పవర్ ప్లస్ క్లాస్. అలాంటి ఆటను మళ్లీ చూడలేమనే బాధలో అభిమానులుండగా.. దానికి సమాధానంగా కనిపిస్తోంది. గతేడాది యూఎస్ ఓపెన్ టైటిల్ కొట్టి సంచలనం రేపింది కొకొ గాఫ్.. తాజాగా మరో సంచలనం సృష్టించింది. ఈ యంగ్‌స్టర్ ప్రతిష్ఠాత్మక ఆక్లాండ్ క్లాసిక్ టైటిల్ గెలిచింది. దీంతో యూఎస్ ఓపెన్ నెగ్గడం ఆమెకిదే రెండోసారి.
ALSO READ: ఎడ్లబండిపై జడేజా విహారం.. నెట్టింట్లో వీడియో వైరల్
రెండో అమెరికన్‌గా గాఫ్ చరిత్ర..
ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్విటోలినాపై కొకొ గాఫ్ దుమ్ములేపింది. ఈమె ఎలీనాపై 6-7, 6-3, 6-3తో గెలుపొందింది. డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టింది. దీంతో పాటు రెండో అమెరికన్‌గా గాఫ్ చరిత్ర సృష్టించింది. కాగా, జర్మనీ క్రీడాకారిణి జులియా గార్జెస్ 2018, 2019లో ఆక్లాండ్ క్లాసిక్ ట్రోఫీ విజేతగా అవతరించింది. ఇక అమెరికా తరఫున ప్యాటీ ఫెండిక్ 1988, 1989లో చాంపియన్‌గా నిలిచింది.