తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Novak Djokovic: నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్… శుభారంభం చేసిన జకోవిచ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ లో టెన్నిస్ గ్రాండ్ సీజన్ ప్రారంభం అయింది. టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. క్రొయేషియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు డినో ప్రిజ్మిక్ తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో జకోవిచ్ 6-2, 6-7, 6-3, 6-4తో విజయం సాధించాడు.

Also Read: బీసీసీఐ కీలక నిర్ణయం… మహిళలకు రెడ్‌బాల్ క్రికెట్

వరుసగా నాలుగేళ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలుస్తున్న జకోవిచ్ కు నేటి మ్యాచ్ లో 18 ఏళ్ల టీనేజి ఆటగాడు ప్రిజ్మిక్ నుంచి ఓ మోస్తరు ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్ ను జకోవిచ్ సునాయాసంగానే గెలిచినా, రెండో సెట్ లో ప్రిజ్మిక్ పుంజుకుని టైబ్రేకర్ వరకు తీసుకెళ్లాడు. ఆ సెట్ ను టైబ్రేకర్ లో ప్రిజ్మిక్ 7-5తో గెలుచుకున్నాడు. అయితే, డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ ఆ తర్వాత వరుసగా మూడు, నాలుగు సెట్లు గెలిచి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button