తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS: అవి పుకార్లే… కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే ఉంటా: సత్యవతిరాథోడ్

బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు వినిపిస్తోంది. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ వీడుతున్న నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.

Also Read: ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా?: కేసీఆర్

ఎన్నికల్లో ఓడిన తనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. కేసీఆర్ పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానని తెలిపారు. అలాంటి తాను పార్టీ ఎందుకు మారతానని ప్రశ్నించారు. కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటనే ఉంటానని సత్యవతిరాథోడ్ తేల్చి చెప్పారు.

4 Comments

  1. Nice post. I was checking constantly this weblog and I’m impressed!
    Very helpful information particularly the ultimate section :
    ) I care for such info much. I was seeking this particular
    information for a long time. Thanks and good luck.

    Here is my page vpn coupon 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button