తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 07: చరిత్రలో ఈరోజు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను 1948లో స్థాపించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే వివిధ ఆరోగ్య విషయాల గురించి అవగాహన పెంచుతారు. 2024 లో WHO 76వ వార్షికోత్సవం.’నా ఆరోగ్యం, నా హక్కు’ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్‌గా WHO ఎంచుకుంది.

Also Read:  ఏఐతో ఉద్యోగాలకు కోత… అయోమయ పరిస్థితులలో మానవులు

రవిశంకర్ వర్థంతి

పండిట్ రవి శంకర్ ఏప్రిల్ 7, 1920లో గాజీపూర్ లో జన్మించారు. సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు. ఈయన 92 సంవత్సరాల వయసులో డిసెంబర్ 11, 2012 లో కన్నుమూశారు. రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో సత్కరించింది.

రాం గోపాల్ వర్మ బర్త్ డే

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. కాంట్రవర్సీల కింగ్ పుట్టిన రోజు నేడు. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే… మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయరు. తనకు నచ్చితే సినిమా తీస్తారు. నచ్చకపోయినా సినిమా తీస్తారు.

Also Read: మీకు ఈ విషయం తెలుసా?… మోడీ ఆస్తి వీళ్లందరి కంటే తక్కువ!

కోవై సరళ పుట్టినరోజు

తెలుగు, తమిళ సినీ నటి కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. యాక్టర్ గా గుర్తింపు లభించింది టాలీవుడ్ లో. కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో కోవై సరళ చెరిగిపోని స్థానం సంపాదించారు.

మంగళ్ పాండే మరణం

మంగళ్ పాండే 19 జూలై, 1827 జన్మించగా 8 ఏప్రిల్, 1857 మరణించారు.ఈయన ఉత్తరప్రదేశ్ లోని నగ్వాలో హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మంగళ్ పాండే 1857 నాటి భారతీయ తిరుగుబాటుకు ముందు జరిగిన సంఘటనలలో కీలక పాత్ర పోషించిన భారతీయ సైనికుడు . అతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 34వ బెంగాల్ స్థానిక పదాతిదళం రెజిమెంట్‌లో సిపాయి (పదాతి దళం ). 1984లో భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. అతని జీవిత చరిత్ర ఆధారంగా అనేక సినిమాలు కూడా నిర్మించారు.

Also Read: అవి పుకార్లే… కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే ఉంటా: సత్యవతిరాథోడ్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం భవనం వెంకట్రామ్ వర్థంతి

భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 – ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇతను 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇతని మంత్రివర్గం లోనే మంత్రులుగా పనిచేశారు. వెంకట్రామ్ 1931 జూలై 18 న గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో జన్మించారు.

మరికొన్ని విశేషాలు

  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు కాపు రాజయ్య 1925 లో జన్మించారు.
  • తెలుగు, తమిళ సినిమా డైరెక్టర్ ఎస్.పి. ముత్తురామన్ 1935 లో పుట్టారు.
  • ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జాక్వెబ్ ఛార్లెస్ 1823 లో కన్నుమూశారు.
  • రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత భమిడిపాటి రామగోపాలం 2010లో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button