తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Entrance Exams: దేశవ్యాప్తంగా ఎన్నికలు.. పలు ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19 నుండి మొదలై జూన్ 1 వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఈ ఎన్నికల ప్రభావం పడనుంది. జేఈఈ మెయిన్స్, యుపిఎస్సీ ప్రిలిమ్స్, నీట్ పీజీ, కే సెట్, ఎమ్ హెచ్ టీ సెట్, టీఎస్ ఈఏపీసెట్, పాలీసెట్, సీఏ పరీక్షల నిర్వహణపై పడింది.

Also read: Andhra Pradesh: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షను ఏప్రిల్ 4 నుండి 15 వరకు నిర్వహించాల్సిన ఈ పరీక్ష ఇప్పుడు ఏప్రిల్ 4 నుండి 12 వరకు జరగనున్నాయి. ఎంహెచ్టీ సెట్ (పీసీఎం, పీసీబీ) పరీక్షలు ఏప్రిల్ 16 నుండి 30 వరకు పీసీఎం పరీక్ష జరగాల్సి ఉండగా మే 2 నుండి 17 వరకు వాయిదా పడ్డాయి. పీసీబీ పరీక్ష కూడా ఏప్రిల్ 22 నుండి 30 వరకు జరగనుంది.

టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షలు ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీల్లో ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండు సెషన్స్ లో జరగనున్నాయి. టీఎస్ పాలీసెట్ పరీక్షను మే 17న నిర్వహించాల్సి ఉండగా ఈ పరీక్ష మే 24 న ఉదయం 11 నుండి 12:30 వరకు నిర్వహించనున్నారు.

ఏపీ ఈఏపీసెట్ పరీక్ష కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 16,22 తేదీల్లో జరగనుంది. యుపీఎస్సీ సివిల్ పరీక్షను మే 26న నిర్వహించాలి. కానీ ఈ పరీక్ష కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 16న జరగనుంది. నీట్ పీజీ పరీక్షను జూన్ 23న నిర్వహించాల్సి ఉండగా.. ఈ పరీక్ష జులై 15 నాటికి వాయిదా పడే అవకాశం ఉంది.

సీఏ పరీక్ష గ్రూప్ 1 మే 3, 5,9 తేదీల్లో జరగనుండగా, గ్రూప్ 2 మే 11, 15, 17వ తేదీల్లో జరగనుంది. సీయూఈటి పరీక్ష మే 15, 31 తేదీల్లో జరగాల్సి ఉండగా.. పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా జేఈఈ అడ్వాన్స్, నీట్ యుజి, కే సెట్ పరీక్షా తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button