తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జనవరి 22: చరిత్రలో ఈరోజు

సుభాష్ చంద్రబోస్

సుభాస్ చంద్రబోస్ కి 1992 లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. 1945 లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారత ప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా అంగీకరించలేదని, అలాంటి సమయంలో ఆయనకి మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారని కలకత్తా కోర్డులో ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. దీంతో పాటు ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల సుభాస్ చంద్రబోస్ కు భారతరత్న పురస్కారం ఇవ్వలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

Also Read: ముగిసిన విదేశీ పర్యటన.. రేపు హైదరాబాద్‌కు రాక!

అనురాగ్ ఠాకూర్

లోధా కమిటీ సిఫార్సుల అమలుకు సంబంధించిన సమస్యల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్‌ను 2017 జనవరి 22న భారత అత్యున్నత న్యాయస్థానం తొలగించింది. అలాగే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి పదవి నుంచి అజయ్ షిర్కేను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మైక్ టైసన్

ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జనవరి 22, 1988లో అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, హాల్ ఆఫ్ ఫేమర్ లారీ హోమ్స్‌ తలపడ్డారు. అప్పటికే మైక్ టైసన్ నాలుగు బౌట్‌లను గెలుచుకున్నాడు. కానీ ఊహించని రీతిలో ఈ మ్యాచ్ లో టైసన్, హోమ్స్ చేతిలో ఓడిపోయాడు.

Also Read: చెప్పేది ఒకటి చేసేది మరొకటి… షర్మిల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

నెట్‌ఫ్లిక్స్

2018లో నెట్‌ఫ్లిక్స్ $100 బిలియన్ల తో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా అవతరించింది. ఇప్పటికి కూడా నెట్‌ఫ్లిక్స్ కు అత్యంత ఆదరాభిమానులు ప్రేక్షకుల నుంచి లభిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ కు ఉన్న పోటీదారులతో పోల్చితే ఇదే ముందు వరుసలో ఉంటుంది. అభిమానులకు ఎప్పటికప్పుడు వినోదాలను పంచే సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ను అందించడంలో ముందుంటుంది.

నాగశౌర్య

హీరో నాగ శౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జనవరి22, 1989న జన్మించాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆయన నుంచి చందమామ కథలు, దిక్కులు చూడకు రామయ్య,లక్ష్మీ రావే మా ఇంటికి, జాదూగాడు,కళ్యాణ వైభోగమే వంటి మూవీస్ వచ్చాయి.
అశ్వథామ మూవీ ఆయన కెరీయర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Also Read: మార్చి 17 కాంగ్రెస్‌కు ఆఖరి గడువు… హరీష్ రావు హెచ్చరిక

మరికొన్ని విశేషాలు

  • ఆంధ్ర పితామహుడిగా పిలువబడే మాడపాటి హనుమంతరావు 1885 లో ఈరోజే జన్మించారు. ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా 1909 లో యూ థాంట్ నియమితులయ్యారు.
  • హీరో మహేష్ బాబు సతీమణి, హీరోయిన్ నమ్రత శిరోద్కర్ 1972 లో జనవరి 22 న జన్మించారు. తన నటనతో ఎందరో ప్రేక్షకులను సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు 2014 లో ఈరోజే మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button