తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 23: చరిత్రలో ఈరోజు

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం

ప్రపంచ వాతావరణ శాస్ర్త దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. ప్రకృతి సహజ ఆవాసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తుచేసుకుంటారు. 1950 మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరుపబడుతుంది.

రామ్ మనోహర్ లోహియా పుట్టినరోజు

భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, సోషియలిస్ట్, రాజకీయ నాయకుడు రామ్ మనోహర్ లోహియా 1910 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్ జిల్లా అక్బర్ పూర్ గ్రామంలో జన్మించారు.

శ్రీకాంత్ పుట్టినరోజు

టాలీవుడ్ హీరోగా పేరుగాంచిన శ్రీకాంత్ 1968 కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలని గంగావతిలో జన్మించాడు. దాదాపు 125 సినిమాల్లో నటించాడు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా. వన్ బై టు (1993) హీరోగా శ్రీకాంత్ నటించిన మొదటి సినిమా. హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.

అశోక్ దాస్ పుట్టినరోజు

భారతీయ- అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అశోక్ దాస్ 1953 ఒడిశా రాష్ట్రం పూరీ నగరంలో జన్మించారు. 1982 లో రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు న్యూయార్క్ సిటీ కాలేజ్, మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో, రట్జర్స్ విశ్వవిద్యాలయం వద్ద రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేశారు. 1993 లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు.

భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు మరణం

భారత స్వాతంత్ర్య సమర యోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ను 1931లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్ ను హత్య చేసిన ఘటనలో భగత్ సింగ్ ను, ఉద్యమ సమయంలో పలు నేరాల్లో దోషులుగా తేలిన శివరాం రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్ కు జైలు శిక్ష విధించింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో.. వారిని ఉరితీయాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 24 ఉరితీయాలని నిర్ణయించుకున్నా.. అలా చేయలేక మార్చి 23 రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురిని ఉరితీసింది. అంతటితో ఆగక వారి మృతదేహాలను ముక్కలుగా నరికి, సంచుల్లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.

మల్లి మస్తాన్ బాబు మరణం

పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు 2015 చిలీ దేశం సెర్రో ట్రెస్ లో మరణించారు. ఈయన 1974 పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో జన్మించారు. పర్వతారోహణలో గిన్నిస్ రికార్డు సాధించారు. 172 రోజుల్లోనే ఏడు ఖండాల్లోని ఏడు పర్వాతాలను అధిరోహించి రికార్డు నెలకొల్పాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మొదటి తెలుగు తేజం కూడా ఈయనే. చిలీలోని పర్వతప్రాంతాలను అధిరోహిస్తుండగా వాతావరణం అనుకూలంగా లేక తప్పిపోయి మరణించారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించింది.

లీ క్వాన్ యూ మరణం

సింగపూర్ దేశ మొదటి ప్రధాన మంత్రి లీ క్వాన్ యూ 2015 లో మరణించారు. సింగపూర్ జాతిపితగా పేరుగాంచిన ఈయన 1923 సెప్టెంబర్ 16న పుట్టారు. 1959లో బ్రిటిష్ వారి నుంచి విముక్తమైన సింగపూర్‌కు మొదటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లీ 1990 వరకు ఆ పదవిలో ఉన్నారు. సింగపూర్ దేశాన్ని ఆర్థిక వాణిజ్య కేంద్రంగా తీర్చి దిద్దడంలో విశేష కృషి చేశారు.

మరిన్ని విశేషాలు

భారతీయ నటి, నిర్మాత కంగనా అమర్ దీప్ రనౌత్ 1987 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భంబ్లాలో జన్మించారు. ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

ప్రముఖ గాయకుడు, నటుడు విజయ్ యేసుదాస్ 1979లో జన్మించారు. ప్రముఖ గాయకుడు కే.జె. యేసుదాస్ కుమారుడు. విజయ్ 300కి పైగా సినిమా పాటలు పాడారు.

భారత సుప్రీంకోర్టు 35వ మాజీ ప్రధాన న్యాయమూర్తి రమేష్ చంద్ర లహోటీ 2022 న్యూ ఢిల్లీలో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button