తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 25: చరిత్రలో ఈరోజు

నార్మన్ బోర్లాగ్ పుట్టినరోజు

హరిత విప్లవ పితామహుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ 1914 అమెరికాలోని అయోవాలో జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలి బాధలను, పస్తులను కాపాడేందుకు కృషి చేశారు. తన పరిశోధనలతో చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టిరకం గోధుమ వంగడాలను కనిపెట్టారు. 1960 లో కరువుతో పోరాడుతున్న భారత్, పాకిస్తాన్ దేశాలకు ఆ గోధమలను పరిచయం చేశారు. అప్పటి నుంచి రైతుల దిగుబడి రెట్టింపు అయి.. హరిత విప్లవంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్ కనిపెట్టిన గోధుమ సాగవుతోంది. 2006లో బోర్లాగ్ పై ‘ది మ్యాన్ హూ ఫెడ్ ద వరల్డ్’ అనే పుస్తకం వచ్చింది. 1970 లో బోర్లాగ్ కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.

Also Read: జంటనగరాల్లో వైన్ షాపుల మూసివేత

ప్రణయ్ రాజ్ వంగరి పుట్టినరోజు

ఫిల్మ్ మేకర్, తెలుగు నాటక రంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు ప్రణయ్ రాజ్ వంగరి 1985 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జన్మించారు. వినూత్న నాటకాలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న “పాప్ కార్న్ థియేటర్”కు ప్రధాన కార్యదర్శి.’వికీవత్సరం’ అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365 రోజులు- 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించారు. ఆ ఛాలెంజ్‌ను అలాగే కొనసాగిస్తూ 2019 జూన్ 4న 1000 రోజులు- 1000 వ్యాసాలు రాశారు. 2022 మార్చి 1 నాటికి 2000 రోజులు- 3015 వ్యాసాలు పూర్తిచేశారు.

శ్రీరామోజు హరగోపాల్ పుట్టినరోజు

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ 1957 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించారు. 2022లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. పలు పత్రికలకు సాహిత్య వ్యాసాలు, సమీక్షలు రాశారు. అనేక సాహిత్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. అయన రాసిన కవిత్వాన్ని సంపుటులుగా ప్రచురించారు.

Also Read: ఢిల్లీలో దారుణం.. పట్టపగలే బాలికపై దాడి

గణేష్ శంకర్ విద్యార్థి మరణం

స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, పాత్రికేయుడు గణేష్ శంకర్ విద్యార్థి 1931 కాన్పూర్ లో మరణించారు. ఈయన 1890 అక్టోబర్ 26న ఫతేపూర్ జిల్లా హాథ్ గావ్ అనే గ్రామంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, భారత జాతీయోద్యమ కార్యకర్తగా పనిచేశారు. సహాయ నిరాకరణోద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. విక్టర్ హ్యూగో నవల “నైంటీ త్రీ”ని అనువదించారు. ముఖ్యంగా హిందీ వార్తాపత్రిక “ప్రతాప్” వ్యవస్థాపక సంపాదకుడిగా సుపరిచితులు.

మరిన్ని విశేషాలు

  • శని గ్రహానికి అతి పెద్ద ఉపగ్రహం టైటాన్ ను 1655లో క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నారు.
  • మిర్ అంతరిక్ష కేంద్రంలో 10 నెలలు గడిపిన ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ 1992 లో భూమిపైకి వచ్చారు.
  • పాండిచ్చేరి (పుదుచ్చేరి) రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా పనిచేసిన పి. షణ్ముగం 1927 లో జన్మించారు.
  • భారతీయ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ 1933 మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. భారత్ మాన్సూన్ పితామహుడిగా పేరుగాంచారు.
  • పత్రికా రచయిత, నేషనల్ హెరాల్డ్ పత్రిక మాజీ సంపాదకుడు మానికొండ చలపతిరావు 1983లో మరణించారు. ఈయన 1908వ సంవత్సరం విశాఖలో జన్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button