తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Attack: ఢిల్లీలో దారుణం.. పట్టపగలే బాలికపై దాడి

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బాలికపై ఓ దుర్మార్గుడు కత్తితో అటాక్ చేశాడు. వేగంగా వెనుక నుంచి వచ్చి యువతిపై కత్తితో పొడవడం స్టార్ట్ చేశాడు. అటుగా వస్తున్న కొందరు చూసి బెదిరించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. తాజాగా ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Also read: Train: ట్రాక్ పై ఆగిపోయిన రైలు.. నెట్టుకుంటూ వెళ్లిన ఉద్యోగులు

అమన్ అనే యువకుడు అందరూ చూస్తుండగానే బాలికపై దాడి చేశారు. అమన్‌ను స్థానికులు అడ్డుకుని పట్టుకునే ప్రయత్నం చేయగా.. కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తులో అమన్ దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button