తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

జాతీయ అగ్నిమాపక దినోత్సవం

జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తుంటారు. 1944లో ముంబై ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదానికి గుర్తుగా నేడు జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ప్రమాదంలో 66 మంది మరణించగా, 87 మంది గాయపడ్డారు. అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడం వివరిస్తారు.

బి.ఆర్. అంబేద్కర్ పుట్టినరోజు

భారత రాజ్యాంగ నిర్మాత భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 మధ్యప్రదేశ్ లోని మౌ గ్రామంలో జన్మించారు. భారత్ లో అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. అలాగే భారతదేశ మొదటి న్యాయమంత్రిగా సేవలందించారు. మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. దేశ, విదేశాల్లో ఎన్నో ఉన్నత చదువులను పూర్తి చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. దేశానికి ఈయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను మరణానంతరం ప్రకటించింది.

గొల్లపూడి మారుతీరావు పుట్టిన రోజు

నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు 1939 విజయనగరంలో జన్మించారు. 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇక 1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకి స్క్రీన్ ప్లే రాశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ప్రభుత్వ నంది అవార్డును దక్కించుకున్నారు. నటుడిగా మారుతీరావు చేసిన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సూపర్ హిట్ కావడంతో మారుతీరావుకు అవకాశాలు వచ్చాయి. దాదాపు 250పైగా చిత్రాల్లో నటించారు.

మార్గరేట్ అల్వా పుట్టినరోజు

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా 1942 కర్ణాటక రాష్ట్రం మంగళూరులో జన్మించారు. ఈమె అసలు పేరు నజరెత్. 1974లో తొలిసారిగా కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుండి లోక్ సభ ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగానూ విధులు నిర్వర్తించారు. 2006లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గవర్నర్ నియమించబడ్డారు. 2012 నుంచి రాజస్థాన్ గవర్నర్ గా సేవలందించారు.

క్రిస్టియన్ హైగెన్స్ పుట్టినరోజు

ప్రముఖ గణిత శాస్త్రవేత్త క్రిస్టియన్ హైగెన్స్ 1629 హేగ్ పట్టణంలో జన్మించారు. కాంతి తరంగాల రూపంలో ఉంటుందని మొదట ప్రతిపాదించిన వ్యక్తి పేరు హోయిగన్. 1655 లో శనిగ్రహానికి చుట్టూ ఘన వలయం ఉందని ప్రకటించారు. శనికి ఉపగ్రహం టైటాన్ ను కనుగొన్నారు. లోలక గడియారాలు రూపొందించి 1657లో పేటెంట్ పొందారు. కాంతి తరంగ రూపంలో ఈథర్ అనే యానకం ద్వారా ప్రయాణిస్తుందని 1678లో ప్రతిపాదించారు.

శ్రీ రమణ మహర్షి మరణం

భారతీయ ఋషి, తత్వవేత్త రమణ మహర్షి 1950 తిరువణ్ణామలైలోని శ్రీరమణాశ్రమంలో కన్నుమూశారు. ఈయన అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. ఈయన 1879 డిసెంబర్ 30న తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. ఆత్మజ్ఞానం, అద్వైతం, మోక్ష మార్గాలను బోధించారు.

పి.బి. శ్రీనివాస్ మరణం

ప్రముఖ నేపథ్యగాయకుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ 2013 చెన్నైలో మరణించారు. ఈయన 1930 సెప్టెంబర్ 22న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషల్లో ఎన్నో పాటలు పాడారు. శ్రీనివాస్ 1952 జెమిని వారి హిందీ చిత్రం మిస్టర్ సంపత్ తో సినీ జీవితాన్ని ప్రారంభించారు. మొదటిసారిగా 1954లో జాతక ఫలం చిత్రంలో పాడారు. మొత్తం ఆయన 3 వేలకు పైగా పాటలు పాడారు.

ఘంటా గోపాల్ రెడ్డి మరణం

వ్యవసాయ శాస్త్రవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎత్తిపోతల పథకాల సృష్టికర్త ఘంటా గోపాల్ రెడ్డి 2018 సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో కన్నుమూశారు. ఈయన 1932 ఫిబ్రవరి 14న నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జన్మించారు. నాగార్జునసాగర్ ఎడవకాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాటం చేశారు. 1969లో మహాత్మాగాంధీ ఎత్తిపోతల నిర్మాణానికి కృషిచేశారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎత్తిపోతల సృష్టికర్తగా మన్ననలు అందుకున్నారు.

టైటానిక్ ఓడ మునక

వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హార్లాండ్ అండ్ వోల్ఫ్ సంస్థ నిర్మించిన పెద్ద నౌక టైటానిక్. 1912లో తొలిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌకగా ప్రయాణం ప్రారంభించింది. ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయర్క్ వరకూ వెళ్లాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు 1912లో మంచు కొండను ఢీకొని ఏప్రిల్ 15న ఉ. 2 గంటల సమయంలో సముద్రంలో మునిగిపోయింది. అర్ధరాత్రి 11.40 గంటల సమయంలో మంచు పర్వతాన్ని ఢీకొంది. ప్రమాదంలో 1517 మంది మరణించారు.

మరిన్ని విశేషాలు

తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు 1892 విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు.

ప్రముఖ హేతువాది, మానవహక్కుల కార్యకర్త బాబు గోనినేని 1968 హైదరాబాద్ లో జన్మించారు.

రంగస్థల, టీవీ, రేడియో నటుడు కొమరవోలు శ్రీనివాసరావు 1953 గుంటూరు జిల్లా చండూరు మండలం తెనాలి తాలుకాలోని నారికేళ్లపల్లి గ్రామంలో జన్మించారు.

హిందీ యాత్రాసాహిత్య పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్ 1963 పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ లో కన్నుమూశారు.

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో 1981లో రెండో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించారు.

2018-19 బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు.

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 2023లో ఆవిష్కరించారు

One Comment

  1. I should look at this webpage, as my brother advised, and he was entirely right. You have no idea how much time I spent looking for this information, but this post made my day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button