తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

జనవరి 21: చరిత్రలో ఈరోజు

మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం

మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవాన్ని జనవరి 21 న జరుపుకుంటారు. 1972 లో ఈశాన్య ప్రాంత (పునర్వ్యవస్థీకరణ) చట్టం, 1971 ప్రకారం మూడు రాష్ట్రాలు పూర్తి స్థాయి రాష్ట్రాలుగా ఏర్పాడ్డాయి. మూడు రాష్ట్రల ప్రజలు ఈరోజున వివిధ కార్యక్రమాలను జరుపుతూ వారి సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఉత్సావాలను నిర్వహించుకుంటారు.

Also Read: బయటపడ్డ బాబు భూదోపిడీ బాగోతం… మరి ఇంత దారుణమా?

ఇ.వి.వి.సత్యనారాయణ

ఈదర వీర వెంకట సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు. ఇ.వి.వి 10 జూన్ 1958 న జన్మించి జనవరి 21, 2011 న మరణించాడు. ఈయన మొదటి సినిమా చెవిలో పువ్వు. ఇ.వి.వి ఎక్కువగా హాస్యప్రధానమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయనకు ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, జంబలకిడి పంబ, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆమె, తాళి వంటి చిత్రాలు మంచి పేరును తీసుకువచ్చాయి. ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఈయన కొడుకులే.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

రాజ్‌పుత్ 2013 లో విడుదలైన కాయ్ పో చె చిత్రంతో వెండితెరకు మొట్టమొదటి సారిగా పరిచయమయ్యాడు. ఎం.ఎస్.ధోని: ది అంటోల్డ్ స్టోరీ సినిమాలో తన పాత్రకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. 2018 లో విడుదలైన కేదార్నాథ్, 2019 లో వచ్చిన చిచోరే సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈయన జనవరి 21, 1986 లో జన్మించగా 14 జూన్ 2020 లో తన 34 సంవత్సరాల వయసులో, ముంబై బాంద్రాలోని తన ఇంట్లో రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త… ప్రమాద బీమా పెంపు… ఎంతంటే?

వ్లాదిమిర్ లెనిన్

వ్లాదిమిర్ లెనిన్ అని పిలవబడే వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియానోవ్ రష్యన్ విప్లవకారుడు, రాజకీయవేత్త మరియు రాజకీయ సిద్ధాంతకర్త. నేడు ఈయన మరణించిన రోజు. ఈయన సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు. అతను 1917 నుండి 1924 వరకు సోవియట్ రష్యాకు అధిపతిగా వ్యవహరించాడు.

ప్రపంచ మత దినోత్సవం

ప్రపంచ మత దినోత్సవం జనవరి నెలలో మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఇది జనవరి 21, 2024న వస్తుంది. ఏడాదికి ఒకరోజు అన్ని మతాల వారు వారి మధ్య విభేదాలను మరచి కలిసి ఉండాలనేదే దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచ మత దినోత్సవం మొదటిసారిగా 1950లో నిర్వహించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button